ఉద్యోగాలు పోతున్నాయి.నాకు మాత్రం సూపర్‌: క్రేజీ ‘బారీ’ ప్రకటన ఏంటంటే! | People losing homes but super year for me Barrie Drewitt Barlow | Sakshi
Sakshi News home page

ఉద్యోగాలు పోతున్నాయి.నాకు మాత్రం సూపర్‌: క్రేజీ ‘బారీ’ ప్రకటన ఏంటంటే!

Published Tue, Nov 14 2023 5:19 PM | Last Updated on Tue, Nov 14 2023 6:10 PM

People losing homes but super year for me Barrie Drewitt Barlow  - Sakshi

బ్రిటీష్ మల్టీ-మిలియనీర్, పారిశ్రామికవేత్త బారీ డ్రివిట్-బార్లో (53)  గుర్తున్నాడా. గే కపుల్‌గా క్రేజీ  రికార్డు క్రియేట్‌ చేసిన  బారీ ఇపుడు మళ్లీ వార్తల్లోకి వచ్చాడు. రానున్న క్రిస్మస్‌ సందర్భంగా  తన ఖర్చును తగ్గించుకుంటున్నట్టు తాజాగా ప్రకటించాడు. ఎందుకంటే  దేశం కష్టాల్లో ఉంది. అలాగే ప్రపంచంలో చాలా మంది  ఉద్యోగాలు, ఇళ్లను కోల్పోతున్న బాధలో  ఉన్నారు. అందుకే  ఈ ఏడాది క్రిస్మస్ ఖర్చును కేవలం  28 కోట్ల రూపాయలకు  పరిమితం చేయబోతున్నానని తెలిపాడు. అలాగే తన హాలిడే షాపింగ్‌ను తగ్గించాలని ప్లాన్ చేసుకున్నానని కూడా పేర్కొన్నాడు. కానీ తనకు, తన వ్యాపారాలకు మాత్రం 2023  సూపర్ రికార్డ్ సంవత్సరం అని ప్రకటించాడు.

అయితే ఇప్పటికే క్రిస్మస్ బడ్జెట్‌లో తన ఫియాన్సీ స్కాట్‌ కోసం 1.9కోట్ల రూపాయల విలువైన బ్రాండ్‌ న్యూ ఆడి ఆర్‌8ని కొనుగోలు చేశాడు. అలాగే కొడుకు ఆస్పెన్ కోసం లగ్జరీ అపార్ట్‌మెంట్లు, ఇళ్లను నిర్మించడానికి భూమిని కొనుగోలు చేశాడు. వ్యాపారంలో విజయం,క్రిస్మస్‌ సందర్భంగా ఆస్పెస్‌కి ప్రత్యేకంగా ఏదైనా ఇవ్వాలని నిర్ణయించు కున్నాడట. అందుకే ఖరీదైన  కొత్త రోలెక్స్ G-వ్యాగన్ రడీ చేశాడు. అతని భార్య పిమ్ కోసం, ఆమె ఫ్యామిలీకి దగ్గరగా ఉండేలా ఆమె సొంత ఊరు బ్యాంకాక్‌లోని కోట్ల విలువచేసే కొత్త అపార్ట్‌మెంట్,  కొత్త రోజ్ గోల్డ్ రోలెక్స్ వాచ్‌ కొనుగోలు చేశాడు.

ఇంకా అయిపోలేదు అతని కుమార్తె సఫ్రాన్ కోసం, ప్లాటినం రోలెక్స్ వాచ్‌, లెక్కలేనన్ని దుస్తులు,  లేటెస్ట్ లూయిస్ విట్టన్ బ్యాగ్‌లు ఇలా బోలెడు విలువైన వస్తువులు ఆమె కోసం సిద్ధం చేశాడు.  దీంతో పాటు మిగిలిన పిల్లలకి కూడా క్రిస్మస్ కానుకలుగా లగ్జరీ వాచీలు, కార్లు, ఆస్తులను పొందబోతున్నారని స్వయంగా బారీ మీడియాకు  వెల్లడించాడు. 
 
బారీ డ్రూవిట్-బార్లో  టోనీ రికార్డులు, పిల్లలు
బ్రిటన్‌లో బారీ డ్రివిట్-బార్లో భాగస్వామి టోనీతో కలిసి తొలి  గే కపుల్‌గా రికార్డు సృష్టించారు.  దాదాపు  11 సంవత్సరాలు  కలిసి వున్న తరువాత పిల్లల్ని  దత్తత తీసుకోవాలని భావించారు. కానీ  1999లో కాలిఫోర్నియాలో సరోగేట్ ద్వారా  కవలలు  సాఫ్రాన్‌,  ఆస్పెన్‌ జన్మనిచ్చి మరో హిస్టరీ క్రియేట్‌ చేశారు.  అంతేకాదు జనన ధృవీకరణ పత్రాలపై తల్లి, తండ్రికి బదులుగా పేరేంట్‌ -1, పేరెంట్‌-2 అని నమోదు చేసేలా స్వలింగ తల్లిదండ్రులను అనుమతించాలని ఈ జంట కోర్టును ఆశ్రయించి విజయం సాధించింది. LGBTQ కమ్యూనిటీకి సంబంధించి ఇదొక చారిత్రాత్మక సందర్బంగా నిలిచింది.  ఇపుడు ముగ్గురు తల్లిదండ్రులుగా నమోదయ్యేందుకు  ప్రయత్నస్తున్నాడు ఈ క్రేజీ గే బారీ. అంతేకాదు  అంతర్జాతీయ స్పెర్మ్‌ డోనర్‌గా ఇప్పటికే 17మంది పిల్లలకు జీవసంబంధమైన తండ్రిని అని ఇటీవల  ప్రకటించాడు బారీ.

ఆ తరువాత ఈ జంట  సరోగసీ ద్వారా  ఓర్లాండో, జాస్పర్ , డల్లాస్ అనే కవల పిల్లలు సహాఎనిమిది మంది పిల్లలున్నారు.  కూతురు  సాఫ్రాన్‌ మాజీ ప్రియుడు స్కాట్ హచిసన్‌తో ప్రేమ కారణంగా  2019లో  టోనీతో 32 ఏళ్ల సంబంధాన్ని తెంచుకున్నాడు బారీ. 2020లో, బారీ  స్కాట్ తొలిబిడ్డ వాలెంటినా పుట్టింది. 

ఇక బారీ- టోనీ వ్యాపారానికి విషయానికి వస్తే రియల్ ఎస్టేట్, ట్రాన్స్-అట్లాంటిక్ సరోగసీ వ్యాపారం, గ్లోబల్ మెడికల్ రీసెర్చ్ కంపెనీతో సహా అనేక వ్యాపారాలతో కోట్లకు పడగలెత్తారు. ముఖ్యంగా తన సంతానానికి ప్రతీ ఏడాది క్రిస్మస్ సందర్భంగా ఖరీదైన బహుమతులిచ్చి  ప్రత్యేకంగా నిలుస్తూ ఉంటాడు బారీ . గత ఏడాది  క్రిస్మస్ కోసం సుమారు 4 మిలియన్ యూరోలు ఖర్చు చేశాడట.  కొడుకు కోసం ఏకంగా  రూ.25 కోట్ల విలువైన బోటును గిఫ్ట్‌గా ఇచ్చాడు

పుట్టిన రెండు  రోజులకే మిలియనీర్ క్లబ్‌లో మనవరాలు 
అంతేకాదు తన మనవరాలికి భారీ ఎత్తున ఆస్తులను పంచి ఇచ్చి పుట్టిన 2 రోజులకే మిలియనీర్‌గా అవతరించిన రికార్డును అందించాడు. విలాసవంతమైన ఇల్లు, 10 కోట్ల ఆస్తి, 52 కోట్ల ట్రస్ట్‌ను ఆమెకు రాసిచ్చానని బార్లో ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించాడం అప్పట్లో వైరల్‌ అయింది.ఈ  భవనంలో  పాపాయికి  సేవలు చేసేందుకు సకల ఏర్పాట్లు చేసినట్లు పేర్కొనడం విశేషంగా నిలిచింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement