కూటమి ప్రభుత్వం హామీలు నెరవేర్చాలి
ఎస్‌టీయూ నేతల డిమాండ్ కలెక్టరేట్ వద్ద ధర్నా
నరసరావుపేట ఈస్ట్: కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్‌టీయూ) రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కె.కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టో హామీల అమలు డిమాండ్ చేస్తూ ఎస్‌టీయూ ఆధ్వర్యంలో చేపట్టిన దశల వారీ ఉద్యమంలో భాగంగా శుక్రవారం జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాలో కోటేశ్వరరావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం తన హామీల్లో భాగంగా 12వ పీఆర్సీ ఏర్పాటు చేయాలనీ, అప్పటి వరకు 30 శాతం మధ్యంతర భృతిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాకు అధ్యక్షత వహించిన ఎస్‌టీయూ జిల్లా అధ్యక్షుడు ఎల్.వి.రామిరెడ్డి మాట్లాడుతూ, రూ.34 వేల కోట్లను దశల వారీగా విడుదల చేయాలని పెండింగ్‌లో ఉన్న 4 డీఏలను విడుదల చేయాలని కోరారు.


