బీజేపీ మహిళ మోర్చా కమిటీ బాధ్యతల స్వీకరణ
గుంటూరు మెడికల్: బీజేపీ జిల్లా మహిళా మోర్చా నూతన కమిటీ సభ్యులు శుక్రవారం గుంటూరు లాల్‌పురం రోడ్డులోని బీజేపీ జిల్లా కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతిరావు సమక్షంలో జిల్లా మహిళ మోర్ఛా అధ్యక్షురాలు డాక్టర్ శనక్కాయల రాజామాధవి నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేసి ప్రమాణం చేయించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని నూతన కమిటీ అన్నారు. మహిళ మోర్చా ఉపాధ్యక్షునిగా వాణి వెంకట్, సాధువాణి, లక్ష్మీదేవి, చాముండేశ్వరి, స్వాతి, విజయలక్ష్మి, ప్రధాన కార్యదర్శులుగా కాసు శ్రీదేవి, కఠారి పద్మజ, కార్యదర్శులుగా రాధిక, రమ్య, రమాదేవి, లక్ష్మీప్రసన్న, పర్హానా, కోశాధికారిగా డాక్టర్ స్రవంతి, సోషల్‌మీడియా కన్వీనర్‌గా వెంకటలక్ష్మి, కార్యనిర్వాహక సభ్యులుగా లీలారాణి, ఉష, లీల, దుర్గా, పద్మా, బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మహిళ మోర్చా కమిటీకి మహిళ మోర్ఛా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నడ్డి నాగమల్లేశ్వరి, గుంటూరు మిర్చి యార్డు డైరెక్టర్ శ్రావణ్‌కుమార్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఈదర శ్రీనివాసరెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కుమార్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి భజరంగ్ రామకృష్ణ, తదితరులు అభినందనలు తెలిపారు.


