క్వారీ బాలకోటేశ్వర స్వామి తిరునాళ్ల | - | Sakshi
Sakshi News home page

క్వారీ బాలకోటేశ్వర స్వామి తిరునాళ్ల

Feb 14 2026 7:59 AM | Updated on Feb 14 2026 7:59 AM

క్వారీ బాలకోటేశ్వర స్వామి తిరునాళ్ల

క్వారీ బాలకోటేశ్వర స్వామి తిరునాళ్ల

పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే బాలకోటేశ్వర స్వామి ఆలయంలో సాధారణ క్యూ లైన్‌లు, శీఘ్ర దర్శనం, వీఐపీ క్యూలైన్‌లు, వాహన పార్కింగ్‌, ప్రసాదాలు తయారీ, పంపిణీ, వైద్య శిబిరాల ప్రదేశాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రశాంత వాతావరణంలో స్వామిని దర్శించుకొనేలా ఏర్పాట్లు ఉండాలన్నారు. దేవదాయ, రెవెన్యూ, పోలీస్‌ శాఖలను సమన్వయం చేసుకుంటూ అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

గత సంవత్సరం శివరాత్రికి వచ్చిన భక్తుల సంఖ్యకు రెండింతల అంచనాతో అవసరమైన అన్ని ఏర్పాట్లు, పకడ్బందీగా పూర్తి చేయాలన్నారు. భక్తుల భద్రత, రక్షణే ప్రాధాన్యంగా ఏర్పాట్లు చేయాలన్నారు.

పోలీస్‌ శాఖ సూచన మేరకు భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూలైన్లు, బారికేడ్లు, సీసీ కెమెరాలు, ఏర్పాటు చేయాలన్నారు.

ప్రసాదాలను పరీక్షించిన తరువాత మాత్రమే భక్తులకు పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా సూచించారు. సూచిక బోర్డులతో పాటు, నిరంతరం భక్తులకు సూచనలు అందించేందుకు పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టమ్‌ను, సీసీటీవీ కెమెరాలు మానిటరింగ్‌కు కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.

విద్యుత్‌, అగ్నిమాపక శాఖ మార్గదర్శకాల ప్రకారం అన్ని భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు.

నిరంతరం పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహణకు సిబ్బందిని సిద్ధం చేయాలని, భక్తుల రద్దీకి అనుగుణంగా మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని చెప్పారు.

భక్తులకు సురక్షిత తాగునీరు అందించాలన్నారు. ఎటువంటి తోపులాటలు, తొక్కిసలాటలు, భక్తులను భయబ్రాంతులు చేసే సంఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు చేయాలని తెలిపారు.

ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా

చేబ్రోలు: మహా శివరాత్రి సందర్భంగా వడ్లమూడి క్వారీ బాలకోటేశ్వరస్వామి ఆలయం వద్ద జరిగే తిరునాళ్ల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌ ఎ.తమీమ్‌ అన్సారియా శుక్రవారం పరిశీలించారు.

భక్తులకు సురక్షిత తాగునీరు ..

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ జీవీ రమణ మూర్తి, తెనాలి డీఎస్పీ బి.జనార్ధనరావు, జిల్లా పంచాయతీ అధికారి బీవీ నాగసాయికుమార్‌, తెనాలి ఇన్‌చార్జి సబ్‌కలెక్టర్‌ లక్ష్మీ కుమారి, జడ్పీ సీఈవో జ్యోతిబసు, తహసీల్దారు కె. శ్రీనివాసశర్మ, దేవదాయశాఖ అధికారి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement