విద్యార్థిపై దాడి కేసులో ఏడుగురు అరెస్టు | - | Sakshi
Sakshi News home page

విద్యార్థిపై దాడి కేసులో ఏడుగురు అరెస్టు

Feb 13 2026 3:39 AM | Updated on Feb 13 2026 3:39 AM

విద్య

విద్యార్థిపై దాడి కేసులో ఏడుగురు అరెస్టు

చేబ్రోలు: చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామ సమీపంలో కొద్ది రోజుల కిందట జరిగిన సంఘటనకు సంబంధించి బుధవారం చేబ్రోలు పోలీసులు తొమ్మిది మంది నిందితులలో ఏడుగురిని అరెస్ట్‌ చేశారు. విజ్ఞాన్‌ యూనివర్సిటీలో చదువుతున్న హేమంత్‌కు అదేకాలేజిలో చదువుతున్న శ్రీరామ్‌ మధ్య వివాదం ఉంది. హేమంత్‌కు స్నేహితుడైన బాపట్ల జిల్లా చుండూరు గ్రామానికి చెందిన భరత్‌కు తెలియజేశాడు. విద్యార్థి సంఘం నాయకుడుగా ఉన్న భరత్‌ ఫోన్‌ చేసి శ్రీరామ్‌ను హెచ్చరించాడు. దీనిని మనసులో పెట్టుకున్న శ్రీరామ్‌ తన స్నేహితులతో కలసి విజ్ఞాన్‌ యూనివర్సిటీ ఎదురుగా ఉన్న సపోటా తోటలలోని ఖాళీ ప్రదేశానికి పిలిపించి అక్కడ క్రూరంగా, మానవత్వం మరచి దాడిచేశారు. ఈ సంఘటనను వీడియో చిత్రీకరించి సామాజిక మా ధ్యమాలలో పోస్ట్‌ చేసి ప్రచారం చేశారు. జిల్లా ఎస్పీ వకుల్‌జిందాల్‌ ఆదేశాల మేరకు పొన్నూరు రూరల్‌ సీఐ పి కృష్ణయ్య, ఎస్‌ఐ పి వీరనారాయణలు దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్‌ చేశారు. దారా పరిమళ రిహాన్‌ ఉరఫ్‌ లక్కీ, వెలిశెట్టి ఆదర్శ్‌బాబు, వాకా సోమశేఖర్‌ బాబు ఉరఫ్‌ సోము, రాపోలు తిరుపతిరావు, నందం బాలకోటేశ్వరరావు, టి బాలసాయిరామ్‌, కొత్త సాయి అమరనాథ్‌లను అరెస్ట్‌ చేసి కోర్టుకు హాజరుపరచటంతో న్యాయమూర్తి రిమాండ్‌ విధించినట్లు పోలీసులు తెలిపారు.

జీజీహెచ్‌లో హజ్‌ యాత్రికులకు వ్యాక్సినేషన్‌

గుంటూరు మెడికల్‌: హజ్‌ యాత్రకు వెళ్లే వారికి గుంటూరు జీజీహెచ్‌లో రెండో రోజు గురువారం మెడికల్‌ స్క్రీనింగ్‌, వాక్సినేషన్‌ కార్యక్రమం నిర్వహించారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కొర్రా విజయలక్ష్మి, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్‌ అమర్తలూరి శ్రావణ్‌బాబు, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ యశశ్వి రమణ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. డాక్టర్‌ విజయలక్ష్మి మాట్లాడుతూ హజ్‌ యాత్రకు వెళ్లే 157 మందికి వ్యాక్సిన్‌ ఇవ్వడం జరిగిందన్నారు. కార్యక్రమానికి సహకరించిన హజ్‌ యాత్రికులకు కృతజ్ఞతలు తెలియజేసినారు. కార్యక్రమంలో రాష్ట్ర హజ్‌ కమిటీ చైర్మన్‌, హాజీ హసన్‌ బాష పాల్గొన్నారు.

ఘనంగా క్రెడాయ్‌ అమరావతి చాప్టర్‌ ప్రారంభం

తాడేపల్లిరూరల్‌ : తాడేపల్లి విజయవాడ క్లబ్‌లో గురువారం క్రెడాయ్‌ అమరావతి చాప్టర్‌ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మున్సిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ విచ్చేసి క్రెడాయ్‌ ఆంధ్రప్రదేశ్‌ 2026 డైరీని ఆవిష్కరించారు. మంత్రి మాట్లాడుతూ అమరావతి రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. క్రెడాయ్‌ అమరావతి చాప్టర్‌ కార్యవర్గ ప్రమాణ స్వీకారమహోత్సవం జరిగింది. క్రెడాయ్‌ నేషనల్‌ ప్రెసిడెంట్‌గా జి.రామ్‌రెడ్డి, చైర్మన్‌గా ఎ.నాగమల్లేశ్వరరావు, ప్రెసిడెంట్‌గా ఆర్‌.కొండలరావు, జనరల్‌ సెక్రటరీగా ఎన్‌.పి. ప్రశాంత్‌లను ఎన్నుకున్నా రు. క్రెడాయ్‌ నేషనల్‌ ప్రెసిడెంట్‌ జి. రామ్‌రెడ్డి మాట్లాడుతూ రాజధాని అభివృద్ధిలో క్రెడాయ్‌ భాగస్వామ్యం ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. క్రెడాయ్‌ ఏపీ చైర్మన్‌ బుడ్డిగ శ్రీనివాస్‌, ప్రెసిడెంట్‌ బాయన శ్రీనివాసరావు, జనరల్‌ సెక్రటరి దాసరి రాంబాబు ఉన్నారు.

విద్యార్థిపై దాడి కేసులో ఏడుగురు అరెస్టు 1
1/1

విద్యార్థిపై దాడి కేసులో ఏడుగురు అరెస్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement