కూరగాయలు విక్రయిస్తూ పీఏసీఎస్ ఉద్యోగుల నిరసన
రేపు సహకార శాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడి
కొరిటెపాడు(గుంటూరు): దీర్ఘకాలికంగా పేరుకుపోయిన వ్యవసాయ సహకార సంఘం ఉద్యోగుల న్యాయమైన కోర్కెలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శ్యామలానగర్‌లోని రాష్ట్ర సహకార శాఖ కమిషనర్, రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట బుధవారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. కూరగాయలు విక్రయిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. తక్షణమే సమస్యలు పరిష్కరించి తమ ఆకలి తీర్చాలని, రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన పీఏసీఎస్ ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
– ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర నాయకుడు వెలుగూరి రాధాకృష్ణ మాట్లాడుతూ గత రెండు నెలలుగా పీఏసీఎస్ ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం వివిధ రూపాల్లో ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించకపోవడం దుర్మార్గమన్నారు.


