iPhone 14 Yellow: ఐఫోన్‌ ఎల్లో వేరియంట్‌పై భలే డిస్కౌంట్‌! ఎంతంటే...

iPhone Yellow variant available with up to 15000 discount - Sakshi

మనలో చాలా మందికి ఐఫోన్‌లంటే బాగా క్రేజ్‌. ప్రతి ఒక్కరూ ఐఫోన్ కొనాలని కలలు కంటారు. కానీ వాటి ధరలు ఎక్కువగా ఉండటంతో కొనలేకపోతుంటారు. అయితే పలు ఐఫోన్‌ మోడళ్లపై ఇటీవల భారీ డిస్కౌంట్‌లు లభిస్తున్నాయి. వీటిని గరిష్టంగా ఉపయోగించుకుంటే తక్కువ ధరకే కలల ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు.

ఇదీ చదవండి: Realme C33 2023: తక్కువ ధరలో రియల్‌మీ ఫోన్లు... కిర్రాక్‌ ఫీచర్లు!

ఐఫోన్‌ 14 సిరీస్‌లో ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ ఫోన్‌లు గతేదాది ఐదు రంగుల్లో విడుదలైంది. మళ్లీ ఈ మధ్య మరో కలర్ వేరియంట్‌ను యాపిల్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. అదే ఎల్లో వేరియంట్‌.  యాపిల్ డిస్ట్రిబ్యూటర్లలో ఒకరైన రెడింగ్టన్ ఐఫోన్‌ 14 సిరీస్‌ ఎల్లో వేరియంట్‌ భారీ డిస్కౌంట్‌ ప్రకటించింది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లపై రూ.15,000 వరకు తగ్గింపు ఇవ్వనున్నట్లు పేర్కొంది. స్టోర్ డిస్కౌంట్‌లు, బ్యాంక్ ఆఫర్‌లు, పాత ఐఫోన్‌ల ఎక్సేంజ్‌ ద్వారా ఈ తగ్గింపు లభిస్తోంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కూడా ఈ తగ్గింపులు పొందవచ్చు.

ఇదీ చదవండి: 100 సీసీ హోండా షైన్‌ వచ్చేసింది! ధర దాని కంటే తక్కువే..

ఈ  ఐఫోన్‌ 14 ఎల్లో వేరియంట్ మార్చి 10 నుంచి ప్రీ ఆర్డర్ కోసం అందుబాటులోకి వచ్చింది. మార్చి 14 నుంచి రిటైల్ స్టోర్‌లలో విక్రయిస్తున్నారు.  ఐఫోన్‌ 14 ఎల్లో వేరియంట్ ధర రూ. 79,990.  ఐఫోన్‌ 14 ఎల్లో వేరియంట్ ప్లస్‌ ప్రారంభ ధర రూ. 89,990. అయితే ఇందులో రంగు తప్ప ఎటువంటి అప్‌డేట్‌లు ఇవ్వలేదు. 6.1 అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లే, A15 బయోనిక్ చిప్‌సెట్‌తో వస్తుంది. ఇక ఐఫోన్ 14 ప్లస్‌లో 6.7 అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. ఇందులో మూడు వేరియంట్‌లు 128జీబీ స్టోరేజ్‌ 6జీబీ ర్యామ్‌, 256జీబీ స్టోరేజ్‌ 6జీబీ ర్యామ్‌, 512జీబీ స్టోరేజ్‌ 6జీబీ ర్యామ్‌ అందుబాటులో ఉన్నాయి.

ఇదీ చదవండి: మూత పడనున్న మరో బ్యాంక్‌? భారీగా పతనమైన షేర్లు..

మరిన్ని వార్తలు :

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top