
ప్రపంచ కుబేరుడు 'ఎలాన్ మస్క్' (Elon Musk) గురించి తెలిసిన చాలామందికి.. అతని నలుగురు పిల్లలకు తల్లి అయిన 'షివోన్ జిలిస్' (Shivon Zilis) గురించి బహుశా తెలిసుండకపోవచ్చు. ఇంతకీ ఈమె ఎవరు? ఈమె గురించి ఆసక్తికరమైన విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
నిజానికి.. షివోన్ జిలిస్ భారతీయ మూలాలున్న మహిళ. ఎలా అంటే ఈమె తల్లి పంజాబీ ఇండియన్ శారద. అయితే శారద కెనడియన్ అయిన రిచర్డ్‌ని వివాహం చేసుకుంది. వీరిద్దరికి పుట్టిన సంతానమే షివోన్ జిలిస్. ఈమె 1986 ఫిబ్రవరి 8న కెనడాలోని అంటారియోలోని మార్ఖమ్‌లో జన్మించింది.

షివోన్ జిలిస్ అమెరికాలోని ప్రతిష్టాత్మక యేల్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రం, తత్వశాస్త్ర డిగ్రీలు పూర్తి చేశారు. ఐటీ దిగ్గజం ఐబీఎం కంపెనీలో తన కెరీర్ ప్రారంభించింది. యేల్ యూనివర్సిటిలో చదువుకునే సమయంలో ఐస్ హాకీ జట్టులో కీలక సభ్యురాలు. గోల్ కీపర్‌గా ఆల్ టైమ్ బెస్ట్. ఆమె గిటార్, డ్రమ్స్ కూడా ప్లే చేసేది.
షివోన్ జిలిస్ కెనడియన్ ఏఐ నిపుణురాలు, వెంచర్ క్యాపిటలిస్ట్. ఆమె మస్క్ వ్యాపార సామ్రాజ్యంలో కీలక పాత్ర పోషిస్తుంది. అంతే కాకుండా ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్‌లో ప్రత్యేకత కలిగిన టెస్లా, ఓపెన్‌ఏఐ, న్యూరాలింక్ వంటి కంపెనీలలో పనిచేసినట్లు సమాచారం.

షివోన్ జిలిస్ 2016లో ఓపెన్ఏఐ (OpenAI)లో బోర్డు సభ్యురాలిగా చేరింది. తరువాత 2017 నుంచి 2019 వరకు టెస్లాలో పనిచేసింది, అక్కడ ఆమె కంపెనీ ఆటోపైలట్ ప్రోగ్రామ్, సెమీకండక్టర్ వంటి విభాగాల్లో కీలక పాత్ర పోషించింది. ఆ సమయంలో మస్క్ బ్రెయిన్ చిప్ స్టార్టప్ న్యూరాలింక్‌లో ప్రధాన పాత్ర పోషించింది. అక్కడ ఆమె ఆపరేషన్స్, ప్రత్యేక ప్రాజెక్టుల డైరెక్టర్‌గా పనిచేస్తోంది.
ఇదీ చదవండి: ఆ నగరం భారతదేశ బాహుబలి: ఆనంద్ మహీంద్రా
2021లో షివోన్ జిలిస్ కవలలకు జన్మనించింది, 2024లో మూడవ బిడ్డను స్వాగతించింది. కాగా ఇటీవల నాల్గవ బిడ్డకు జన్మనిచ్చినట్లు, బిడ్డకు సెల్డాన్ లైకుర్గస్ (Seldon Lycurgus) అని పేరు పెట్టినట్లు వెల్లడించింది. మొత్తం మీద ఇప్పుడు ఎలాన్ మస్క్ 14 మంది పిల్లలకు తండ్రి అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment