భలే మంచి ‘బెల్టు’ బేరం! | Auction for operating an unofficial belt shop in the village | Sakshi
Sakshi News home page

భలే మంచి ‘బెల్టు’ బేరం!

May 25 2025 2:48 AM | Updated on May 25 2025 2:48 AM

Auction for operating an unofficial belt shop in the village

శ్రీకాకుళం జిల్లా పల్లిసారథిలో రూ.9 లక్షలకు వేలం

గ్రామ దేవత ఉత్సవాల్లో ఏరులై పారుతున్న లిక్కర్‌

బాటిల్‌పై రూ.30 అదనంగా వసూలు

వజ్రపుకొత్తూరు రూరల్‌ :  శ్రీకాకుళం జిల్లా వజ్రపు­కొ­త్తూరు మండలం పల్లిసారథిలో మద్యం ఏరులై పారుతోంది. గ్రామంలో శుక్రవారం నుంచి గ్రామ దేవత ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గ్రామంలో అనధికారికంగా బెల్ట్‌ షాపు నిర్వహణకు వేలంపాట వేశారు. దీంతో.. రూ.9 లక్షలకు బెల్టు షాపును ద­క్కించుకున్న వారు ప్రభుత్వ పాఠశాల ఎదు­రుగానే దుకాణం తెరిచారు. కళ్లెదురుగానే ఈ తంతు జరు­గుతున్నా ఎక్సైజ్‌ , పోలీసు అధికారులు ప్రేక్షక­పా­త్రకు పరిమిత­మయ్యారు. 

ఇక్కడ ఒక్కో మద్యం బా­టిల్‌పై రూ.30 అదనంగా వేసి మరీ అమ్ముతు­న్నా­రు.అనధికార బారు షాపు ఏర్పాటు కోసం ఎక్సైజ్‌ అధికారులకు రూ.1 లక్ష, పోలీసులకు రూ.50 వేలు గ్రామం నుంచి అందించినట్లు ఆరోపణలు వినిపి­స్తున్నాయి. బెల్టు షాపు నిర్వాహకులు వారం ముందు నుంచే అక్కడ బార్‌ షాపు తెరి­చారు.

 పోలీసులు అభ్యంతరం వ్యక్తంచేయడంతో రెండ్రోజుల పాటు విక్ర­యా­లు బంద్‌ అయ్యాయి. దీంతో టీడీపీ నాయ­కులు, ఉత్సవ కమిటీ సభ్యులు అధికారులను మచ్చి­క చేసుకోవడంతో మద్యం అమ్మకాలు జోరందుకు­న్నాయి. ఈ విషయంపై ఎక్సైజ్‌ సీఐ మల్లికార్జున­రావును వివరణ కోరగా.. బెల్ట్‌ షాపు విషయం తమ దృష్టికి వచ్చిందని, షాపుని మూసేసి మద్యం అమ్మకాలను నియంత్రించామని చెప్పారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement