పేదలకు ‘పట్టా’భిషేకం: అడుగడుగునా ఆటంకాలు.. పెత్తందారుల కుట్రలు చేధించి మరీ..

Amaravati Lands Distribution To Poor AP CM YS Jagan  - Sakshi

తాము మాత్రమే బాగుండాలనేది పెత్తందారుల తత్వం.. 
అందుకే న్యాయపరమైన అడ్డంకులు సృష్టించారు 
కోర్టులో కేసులు వేయించి.. పట్టాల పంపిణీ ప్రక్రియను అడ్డుకునే ప్రయత్నం చేశారు
పైగా అమరావతిలో పేదలకు స్థానంలేదని తక్కువచేసి మాట్లాడారు.. 
పేదలకు ఇళ్లిస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని వక్రభాష్యాలు చెప్పారు.. 
చివరకు.. ప్రభుత్వం ఇస్తున్న సెంటు స్థలాలను సమాధులని కూడా అవహేళన చేశారు.
యెల్లో మీడియా సైతం ఆ కుటిల యత్నాలకు వంతపాడింది..

కానీ, ఇలాంటి ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ప్రేలాపనలు చేసినా.. జగనన్న పట్టించుకోలేదు. విప‌త్క‌ర ప‌రిస్థితుల్లోనూ ఆ అంశంపైనే దృష్టి పెట్టారు. పేద అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలన్నది ఆయన అభిమతం. నిలువ నీడలేని వారికి సొంత గూడు ఇవ్వాలన్నదే ఆయన ఉద్దేశం. ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఇవ్వాలన్నది జగనన్న లక్ష్యం. పేద కుటుంబాల భవిష్యత్తు బాగుండాలన్న కృతనిశ్చయంతో అడ్డంకులన్నీ అధిగమించారు. 

ఇళ్ల స్థ‌లాల పంపిణీకి ప్ర‌తిప‌క్ష పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా సీఎం జగన్‌ ఆగిపోలేదు. పేద కుటుంబాల ముఖాల్లో సంతోషం చూడాలనే ధృడ సంకల్పంతో ముందుకు సాగారు. ఫలితంగా.. అమరావతిలో 50,793 మంది అక్క చెల్లెమ్మలకు ఇళ్ల స్థలాలు పంపిణీ జరగనుంది. తుళ్లూరు(గుంటూరు) మండలం వెంకట ­పాలెంలో ఏర్పాటుచేసిన వేదిక నుంచి  ‘నవ­రత్నా­లు–­పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ఈ పట్టాలను అందజేయనున్నారు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. తద్వారా సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నారు.

అదే సమయంలో పేద లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు పంపిణీ చేయనున్నారాయన. విశేషం ఏంటంటే.. గత టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసిన ఇళ్లకు సైతం మౌలిస వసతులను అందించింది జగనన్న సర్కార్‌. మొత్తంగా.. నిడమర్రు, మందడం, అనంతవరం, దొండపాడు, ఐనవోలు, పెనుమాక, తుళ్లూరు, నవులూరులో అన్ని వసతులతో రూ.443.71 కోట్లతో నిర్మించిన 5,024 టిడ్కో ఇళ్లను కూడా సీఎం జగన్‌ నేడు పంపిణీ చేయనున్నారు. 

పక్షపాత రహితంగా పంపిణీలు చేపడుతున్న ఏపీ ప్రభుత్వం.. ఏమైనా ఇబ్బందులుంటే 1902 టోల్‌ఫ్రీ నంబర్‌లో సంప్రదించవచ్చని లబ్ధిదారులకు సూచిస్తోంది కూడా. ఈ నిజాయితీ, నీతివంతమైన పాలనను ఏపీ ప్రజానీకం మెచ్చుకుంటోంది. అమరావతిలో ఇళ్ల పట్టాల పంపిణీని హర్షిస్తూ..  ప్రజలు స్వచ్ఛందంగా భారీ ర్యాలీలు చేపట్టారు. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

మరిన్ని వార్తలు :

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top