సఫారీ పర్యటనకు మాటివ్వలేదు: ధుమాల్‌

We Did Not Give The Conformation About South Africa Tour Says Arun Dhumal - Sakshi

న్యూఢిల్లీ: ఆగస్టు నెలలో దక్షిణాఫ్రికాలో పర్యటించే అంశంపై సఫారీలకు తాము ఎటువంటి మాటివ్వలేదని బీసీసీఐ కోశాధికారి అరుణ్‌ ధుమాల్‌ స్పష్టం చేశారు. కేవలం ద్వైపాక్షిక సిరీస్‌ నిర్వహణకు అందుబాటులో ఉండే అవకాశాల గురించి మాత్రమే చర్చించామని తెలిపారు. భారత్‌ తమ దేశంలో పర్యటించేందుకు ఒప్పుకుందని గురువారం పేర్కొన్న క్రికెట్‌ సౌతాఫ్రికా (సీఎస్‌ఏ) డైరెక్టర్‌ గ్రేమ్‌ స్మిత్‌ వ్యాఖ్యలను ధుమాల్‌ కొట్టిపారేశారు. అంతర్జాతీయ ప్రయాణ ఆంక్షలు అమల్లో ఉన్నంత కాలం ఏ దేశంలోనూ తాము పర్యటించబోమని పునరుద్ఘాటించారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top