రాజ్‌కోట్‌ వన్డేలో టీమిండియా ఘనవిజయం

INDIA Won 2nd ODI Against Australia In Rajkot - Sakshi

రాజ్‌కోట్‌ :  ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో 36 పరుగుల తేడాతో భారత్‌ ఘన విజయాన్ని నమోదు చేసింది. టీమిండియా విధించిన 341 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించలేక ఆసీస్‌ చతికిలపడింది. ఆసీస్‌ బ్యాట్సమెన్లలో స్టీవ్‌ స్మిత్(102 బంతుల్లో 98 పరుగులు)‌, లబుషేన్‌( 47 బంతుల్లో 46 పరుగులు)తో కొంత ప్రతిఘటించినా తర్వాత వచ్చిన బ్యాట్సమెన్‌ విఫలం కావడంతో 49.1 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌటైంది. కాగా భారత బౌలర్లలో  షమీ 3 వికెట్లు, రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌, నవదీప్‌ సైనీలు తలా 2 వికెట్లు తీశారు.

అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన టీమిండియా శిఖర్‌ ధావన్‌, విరాట్‌ కోహ్లి, కేఎల్‌ రాహుల్‌లు అర్థశతకాలతో చెలరేగడంతో భారత్‌ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను  టీమిండియా 1-1తో సమం చేసింది. దీంతో నిర్ణయాత్మకంగా మారిన చివరి వన్డే ఆదివారం బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది.  

 

కుల్దీప్‌ @ సెంచరీ   
ఆసీస్‌కు భారీ టార్గెట్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top