మెరిసిన విరాట్‌ కోహ్లి

IND Vs AUS: Kohli Leads India's Charge With Another Fifty - Sakshi

రాజ్‌కోట్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో విరాట్‌ కోహ్లి హాఫ్‌ సెంచరీ సాధించాడు. తొలి వన్డేలో విఫలమైన  కోహ్లి..ఈసారి మాత్రం బాధ్యతాయుతంగా ఆడి అర్థ శతకాన్ని నమోదు చేశాడు. 50 బంతుల్లో మూడు ఫోర్ల సాయంతో హాఫ్‌ సెంచరీ సాధించాడు. ఆడమ్‌ జంపా వేసిన 35 ఓవర్‌ ఐదో బంతికి సింగిల్‌ తీయడం ద్వారా హాఫ్‌ సెంచరీ మార్కును చేరాడు. అంతకుముందు శ్రేయస్‌ అయ్యర్‌(7) నిరాశపరచగా, శిఖర్‌ ధావన్‌(96; 90 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్‌), రోహిత్‌ శర్మ(42; 44 బంతుల్లో 6 ఫోర్లు)లు ఆకట్టుకున్నారు.(ఇక్కడ చదవండి: అయ్యో.. రోహిత్‌)

టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా ఫీల్డింగ్‌ ఎంచుకుంది. దాంతో టీమిండియా ఇన్నింగ్స్‌ను రోహిత్‌-శిఖర్‌ ధావన్‌లు ఆరంభించారు. వీరిద్దరూ సమయోచితంగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళుతున్న క్రమంలో రోహిత్‌(42) తొలి వికెట్‌గా ఔటయ్యాడు. ఈ జోడి మొదటి వికెట్‌కు 81 పరుగులు జోడించింది. ఆపై ధావన్‌కు కోహ్లి జతకలిసి ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఈ క్రమంలోనే ధావన్‌ హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు.  ఈ జోడి 103 పరుగులు జత చేసిన తర్వాత ధావన్‌ రెండో వికెట్‌గా ఔటయ్యాడు. కాసేపటికి శ్రేయస్‌ అయ్యర్‌(7) పెవిలియన్‌ చేరాడు. జంపా బౌలింగ్‌లో షాట్‌ ఆడబోగా అది మిస్‌ కావడంతో బౌల్డ్‌ అయ్యాడు. 39 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేసింది.

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top