వాటే స్పెల్‌ బుమ్రా..

IND Vs AUS: Bumrah Bowls Consecutive Maidens - Sakshi

రాజ్‌కోట్‌: ఆసీస్‌తో జరిగిన తొలి వన్డేలో ఏడు ఓవర్లు వేసి వికెట్‌ కూడా తీయకుండా 50 పరుగులిచ్చిన టీమిండియా పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా.. రెండో వన్డేలో మాత్రం ఇరగదీస్తున్నాడు. తొలి ఓవర్‌ను మొదలుకొని తన మొదటి స్పెల్‌లో నాలుగు ఓవర్లు వేసిన బుమ్రా ఏడు పరుగులే ఇచ్చాడు. ఇందులో ఒక బంతి వైడ్‌ రూపంలో ఇచ్చిన ఐదు పరుగులు మినహా మిగతా బౌలింగ్‌ అంతా అదరగొట్టాడు. తొలి ఓవర్‌లో పరుగు మాత్రమే ఇచ్చిన బుమ్రా.. ఐదు, ఏడు ఓవర్లను మెయిడిన్‌ ఓవర్లుగా వేయడం ఇక్కడ విశేషం. (ఇక్కడ చదవండి: ఇది మనీష్‌ పాండే వికెట్‌!)

ఇన్నింగ్స్‌ ఐదో ఓవర్‌లో ఫించ్‌ స్టైకింగ్‌ ఎండ్‌లో ఉండగా మొత్తం అన్నీ డాట్‌ బాల్స్‌ వేసిన బుమ్రా.. స్మిత్‌ స్టైకింగ్ ఎండ్‌లో ఉన్న ఏడో ఓవర్‌ను కూడా మెయిడిన్‌గా ముగించాడు. దాంతో బుమ్రా వరుసగా రెండు మెయిడిన్లతో ఆసీస్‌కు చుక్కలు చూపించాడు.  కచ్చితమైన లెంగ్త్‌తో పాటు వైవిధ్యమైన బంతులతో ఆసీస్‌ను ముప్పు తిప్పులు పెట్టాడు. దాంతో పరుగులు చేయడానికి ఆసీస్‌ అపసోపాలు పడుతోంది. మిగతా బౌలర్లను హిట్‌ చేసిన ఫించ్‌-స్మిత్‌లు బుమ్రా బౌలింగ్‌ను మాత్రం ఆచితూచి ఆడుతున్నారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top