
లండన్: బ్రిటన్‌కు చెందిన దిగ్గజ రేసర్, ఆరుసార్లు ఫార్ములావన్ చాంపియన్ లూయిస్ హామిల్టన్ స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు శనివారం తెలిపాడు. తనలో కరోనా వైరస్ లక్షణాలేమీ లేవని, అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా క్వారంటైన్‌లోకి వెళ్లిపోయానని అతను పేర్కొన్నాడు. స్టార్ రేసర్ అయిన 35 ఏళ్ల హామిల్ట న్ ఈనెల 4న లండన్‌లో జరిగిన చారిటీ ఈవెంట్‌లో నటుడు ఇడ్రిస్ ఎల్బా, కెనడా ప్రధాని పియరీ భార్య సోఫీ గ్రెగోరీలతో కలిసి పాల్గొన్నాడు. అయితే తాజాగా ఎల్బీ, సోఫీ కోవిడ్–19 పాజిటివ్‌గా తేలడంతో హామిల్టన్ స్వీయ నిర్బంధాన్ని పాటిస్తున్నట్లు చెప్పాడు. ‘ఇడ్రిస్, సోఫీలను కలిసి 17 రోజులు దాటింది. నేను చాలా బాగున్నా. ఎలాంటి వైరస్ లక్షణాలు లేవు. వైద్యులు ఒకటికి రెండుసార్లు పరీక్షించి చెప్పారు’ అని హమిల్టన్ తెలిపాడు.