హామిల్టన్‌ను భయపెట్టారు..!

Hamilton Scarred For Life By Childhood Racial Abuse - Sakshi

మెక్సికో: ఐదుసార్లు ఫార్ములావన్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్స్‌ గెలిచిన బ్రిటిన్‌కు చెందిన మెర్సిడెస్‌ జట్టు డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌ను భయపెట్టిన క్షణాలను మెర్సిడెస్‌ టీమ్‌ చీఫ్‌ టోటో వూల్ఫ్‌ మరొకసారి గుర్తు చేసుకున్నారు. మెక్సికో ఫార్ములావన్‌ గ్రాండ్‌ ప్రిలో భాగంగా వూల్ఫ్‌ మాట్లాడాడు. ‘ హామిల్టన్‌ నల్లగా ఉండటం వల్ల అతనిపై వర్ణ వివక్షతో భయపెట్టారు. హామిల్టన్‌కు సుమారు 10 ఏళ్ల వయసులో ట్రాక్‌లోకి వచ్చినప్పుడు తోటి పిల్లలు అతన్ని నువ్వు నల్లగా ఉన్నావంటూ హేళన చేశారు. అదే సమయంలో ఫార్ములావన్‌ నీవల్ల కాదంటూ బెదిరింపులకు దిగారు. అదే హామిల్టన్‌ను చాంపియన్‌గాన్‌ నిలబెట్టింది.

అతనిలోని వ్యక్తిత్వాని మరింత రాటుదేలేలా చేసింది. ఒకవైపు కామెంట్లు వస్తున్నా హామిల్టన్‌ మాత్రం వాటిని పెద్దగా పట్టించుకోలేదు. ఈ రోజు హామిల్టన్‌ అంటే ఏమిటో ప్రపంచానికి తెలుసు. ఆ వర్ణ వివక్ష వ్యాఖ్యలు హామిల్టన్‌ను తీర్చిదద్దడమే కాదు.. అతను ప్రస్తుతం నివస్తిన్న జీవితానికి సాక్షాలు. ఆ విమర్శలే హామిల్టన్‌ను వ్యక్తిగా ఎంతో పరిణితి సాధించిపెట్టాయి. ప్రతీసారి హామిల్టన్‌కు ఎదురైన చేదు అనుభవాలతో ఈ స్థాయికి రావడం అంటే మాటలు కాదు’ అని టోటో వూల్ఫ్‌ పేర్కొన్నారు.

ఈ సీజన్‌ ఫార్ములావన్‌ గ్రాండ్‌ ప్రిలో హామిల్టన్‌ తొమ్మిందిట విజేతగా నిలిచాడు. మొత్తంగా 338 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇంకా ఈ ఏడాది నాలుగు రేసులో మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో హామిల్టన్‌ మరోసారి చాంపియన్‌షిప్‌పై కన్నేశాడు. కనీసం రెండు రేసుల్లో మూడో స్థానంలో నిలిచినా చాంపియన్‌షిప్‌ టైటిల్‌ను గెలుస్తాడు.  2017, 2018 సంవత్సరాల్లో వరుసగా వరల్డ్‌చాంపియన్‌షిప్‌ టైటిల్స్‌ సాధించిన హామిల్టన్‌ హ్యాట్రిక్‌ కొట్టాలని చూస్తున్నాడు.  గతేడాది 408 పాయింట్లతో చాంపియన్‌షిప్‌ను హామిల్టన్‌ గెలుచుకున్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top