ఆస్ట్రేలియా లక్ష్యం 612 | Australia aimed at 612 | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియా లక్ష్యం 612

Apr 3 2018 12:51 AM | Updated on Apr 3 2018 12:51 AM

Australia aimed at 612 - Sakshi

జొహన్నెస్‌బర్గ్‌: అంతర్జాతీయ క్రికెట్‌లో పునరాగమనం చేసిన తర్వాత సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో తలపడిన 7 సిరీస్‌లలోనూ విజయం సాధించలేకపోయిన దక్షిణాఫ్రికా ఇప్పుడు చరిత్ర సృష్టించేందుకు చేరువైంది. ఆసీస్‌తో సిరీస్‌ను గెలుచుకునేందుకు ఆ జట్టు మరో 7 వికెట్లు తీస్తే చాలు! అసాధ్యమైన 612 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ బరిలోకి దిగిన ఆసీస్‌ మ్యాచ్‌ నాలుగో రోజు సోమవారం ఆట ముగిసే సమయానికి 88 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఆ జట్టు మరో 524 పరుగులు చేయాల్సి ఉండగా... హ్యాండ్స్‌కోంబ్‌ (23 బ్యాటింగ్‌), షాన్‌ మార్‌‡్ష (7 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 134/3తో ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా తమ రెండో ఇన్నింగ్స్‌ను 6 వికెట్ల నష్టానికి 344 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది.

దూకుడుగా ఆడిన కెప్టెన్‌ ఫాఫ్‌ డు ప్లెసిస్‌ (120; 18 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ పూర్తి చేసుకోగా, డీన్‌ ఎల్గర్‌ (81) ఆ అవకాశం కోల్పోయాడు. నాలుగో రోజు ఆధిక్యం 401 పరుగుల నుంచి 450, 500, 550 పరుగులు దాటిపోయినా దక్షిణాఫ్రికా డిక్లేర్‌ చేయకపోవడం ఆశ్చర్యం కలిగించింది.  తమ ముగ్గురు ప్రధాన పేసర్లు రబడ, ఫిలాండర్, మోర్కెల్‌ గాయాలతో బాధపడుతుండటంతో సాధ్యమైనంత ఎక్కువ సేపు బ్యాటింగ్‌ చేసేందుకే ఆ జట్టు మొగ్గు చూపింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement