కర్ణాటకపై ఆంధ్ర గెలుపు | Andhra win over Karnataka | Sakshi
Sakshi News home page

కర్ణాటకపై ఆంధ్ర గెలుపు

Jan 10 2018 1:25 AM | Updated on Jun 2 2018 5:38 PM

Andhra win over Karnataka - Sakshi

సాక్షి, విజయనగరం: సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టి20 సౌత్‌జోన్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌లో ఆంధ్ర జట్టు తొలి విజయం నమోదు చేసింది. కర్ణాటకతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. 157 పరుగుల లక్ష్యాన్ని ఆంధ్ర 18.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి అధిగమించింది. రికీ భుయ్‌ (34 బంతుల్లో 46 నాటౌట్‌; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), అశ్విన్‌ హెబ్బర్‌ (25 బంతుల్లో 35; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), హనుమ విహారి (19 బంతుల్లో 26; 4 ఫోర్లు), రవితేజ (26 బంతుల్లో 33; 4 ఫోర్లు) ధాటిగా ఆడారు.

అంతకుముందు కర్ణాటక 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 156 పరుగులు చేసింది. స్టువర్ట్‌ బిన్నీ (32 బంతుల్లో 47 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఆంధ్ర బౌలర్లలో శశికాంత్‌ మూడు వికెట్లు... శివ కుమార్, బండారు అయ్యప్ప రెండేసి వికెట్లు తీశారు. వైజాగ్‌లో జరిగిన మరో మ్యాచ్‌లో హైదరాబాద్‌ జట్టు 19 పరుగుల తేడాతో గోవాను ఓడించి వరుసగా రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement