వైరల్ : తల్లి వద్దనుకుంది.. డాక్టరే అన్నీ అయి

Meet Duo The Two Faced Kitten With Whom Internet Fell In Love Became Viral - Sakshi

రెండు ముఖాలతో పుట్టిన నాలుగు నెలల పిల్లి తన సోదరులతో కలిసి ఆడుకుంటున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. కాలిఫోర్నియాకి చెందిన డాక్టర్‌ రాల్ఫ్‌ ట్రాన్‌ చెందిన క్లినిక్‌లో ఒక పిల్లి నాలుగు నెలల క్రితం పిల్లలకు జన్మనిచ్చింది. అందులో ఒక్కటి మాత్రం మిగతావాటి కంటే బిన్నంగా రెండు ముఖాలతో పుట్టడంతో తల్లి దానిని దగ్గరికి కూడా రానివ్వలేదు. ఈ నేపథ్యంలో డాక్టర్‌ దానిని పెంచుకోవాలనుకొని భావించి ఇంటికి తీసుకొచ్చాడు. దానికి డుయో అని పేరు పెట్టాడు.

కాగా, ఆ పిల్లి డిప్రోసోపస్‌, క్రానియోఫేషియల్‌ డూప్లికేషన్‌ అనే అరుదైన లోపం ఉన్నట్లు డాక్టర్‌ తెలిపారు. ఇది పుట్టుకతోనే వచ్చే లోపం అని శరీర అవయవాలు అన్నీ ఒకటిగా ఉన్నా ముఖాలు మాత్రం రెండుగా ఉంటాయి. అయితే ముక్కు,నోరు మాత్రం యధావిధిగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. తాజాగా రాల్ఫ్‌ ట్రాన్‌ ... డుయో తన సోదరులైన టైనీ టూనా, డాబీలతో కలిసి ఆడుకుంటున్న ఫోటోలతో పాటు వీడియోనూ ఫేస్‌బుక్‌ పేజీలో పోస్ట్‌ చేశారు. అంతే అది చూసిన ప్రతీ ఒక్కరూ డాక్టర్‌ చేసిన పనికి మెచ్చుకుంటున్నారు. 'వికృత రూపంతో పుట్టిన ఆ పిల్లిని తల్లి కాదన్న మీరు దానిని చేరదీసి ఆరోగ్యవంతంగా తయారు చేశారంటూ' పలువురు నెటిజన్లు ప్రశంసించారు.

'డుయో పుట్టినప్పుడు బరువు తక్కువగా ఉండడంతో అది ఎక్కువ రోజులు బతకదేమో అనుకున్నా. జన్మనిచ్చిన తల్లి కాదన్న ఎలాగైనా బతకాలన్న ఆ పిల్లి పట్టుదల, మనోస్థైర్యమే ఈరోజు దానిని ఆరోగ్యవంతంగా మార్చిందని' డాక్టర్‌ రాల్ఫ్‌ ట్రాన్‌ పేర్కొన్నారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top