
సాక్షి, అమరావతి : కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడు కుట్ర పన్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ ఆరోపించారు. చంద్రబాబు నుంచి ప్యాకేజీ తీసుకున్న పవన్.. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాలో మాట్లాడుతూ.. మూడు పెళ్లిళ్లు చేసుకున్న పవన్ కల్యాణ్.. నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. గృహహింస కేసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న దొంగ పవన్ కల్యాణ్ అని విమర్శించారు. చంద్రబాబు చేసిన అవినీతిలో పవన్‌కు భాగస్వామ్యం ఉందని ఆరోపించారు. సీఎం వైఎస్ జగన్ ప్రజారంజక పాలనను చూసి ఓర్వలేకనే చంద్రబాబు, పవన్ తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని విమర్శించారు.