చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్! | Narendra Modi Phone Call To ChandraBabu And Discuss On AP | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్!

Mar 8 2018 5:34 PM | Updated on Mar 23 2019 9:10 PM

Narendra Modi Phone Call To ChandraBabu And Discuss On AP - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఎన్డీఏ సంకీర్ణ భాగస్వామి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపై చంద్రబాబుతో ఫోన్‌లో మోదీ చర్చించినట్లు సమాచారం. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై ప్రతిపక్ష వైఎస్ఆర్‌సీపీ పోరాటం ఫలితంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో మరోసారి చలనం రాగా, మంత్రుల రాజీనామాలపై ఉత్కంఠ నెలకొన్న విషయం తెలిసిందే. రాజస్థాన్ పర్యటన ముగించుకుని ఢిల్లీకి రాగానే ప్రధాని నరేంద్ర మోదీ, మిత్రపక్ష సీఎం చంద్రబాబుకు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది.

కాగా, నేటి సాయంత్రం 6 గంటలకు కేంద్ర మంత్రులు సుజనా చౌదరి, అశోక్ గజపతిరాజు ప్రధాని మోదీని కలుసుకునేందుకు అపాయింట్‌మెంట్ తీసుకున్నారు. ప్రధానితో ప్రత్యేక హోదాపై చర్చించిన తర్వాత ఈ ఇద్దరు మంత్రులు తమ రాజీనామా లేఖలను మోదీకి సమర్పించనున్నట్లు సమాచారం.

మోదీకి రాజీనామా లేఖలు
ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర మాట తప్పినందున తాము రాజీనామాలు చేస్తామని, ప్రధానిని కలిసి తమ రాజీనామా లేఖలు ఇస్తామని కేంద్ర మంత్రి సుజనా చౌదరి నేటి ఉదయం వెల్లడించారు. రాష్ట్రాభివృద్ధి విషయంలో ప్యాకేజీ అమలులో జాప్యం వల్లే ఏపీలో ఈ పరిస్థితి ఏర్పడిందని సుజనా పేర్కొన్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement