‘నిరూపిస్తే నా తల నరుక్కుంటా’

MLA Vaikuntam Prabhakar Chowdary Slams On JC Diwakar Reddy - Sakshi

జేసీపై మండిపడిన టీడీపీ ఎమ్మెల్యే ‍ ప్రభాకర్‌ చౌదరి

సాక్షి, అనంతపురం: ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది టీడీపీలో వర్గ విభేదాలు  రోజు రోజుకు బయట పడుతున్నాయి. టీడపీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి ఎంపీ జేసీ దివారక్‌ రెడ్డి పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శనివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... జేసీకి వయస్సు మీద పడింది కానీ బుద్ధి రాలేదని అన్నారు. జేసీకి సభ్యత, సంస్కారం అసలుకు లేవు, అందుకే నీ అమ్మా, అబ్బా అంటూ తిడుతున్నారని ఆరోపించారు. జిల్లాలో దివాకర్‌ రెడ్డి బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. జిల్లాలో ఆధికారులను, మీడియాను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. తాను తలుచుకుంటే జేసీ కంటే ఎక్కువ తిట్టగలను, కానీ సంస్కారం అడ్డొస్తోందని అన్నారు.

నిరుపిస్తే తల నరుక్కుంటా...

జేసీ నీకు దమ్ము, దైర్యం ఉంటే తాను అవినీతికి పాల్పడినట్లు నిరుపిస్తే తల నరికేసుకుంటానని ప్రభాకర్ చౌదరి అన్నారు. ఎంపీ దివాకర్‌ రెడ్డి అవినీతిలో పీహెచ్‌డీ చేశారని విమర్శించారు. అనంతపురం జిల్లా అభివృద్ధికి జేసీనే అడ్డుపడుతున్నారని వాఖ్యానించారు. తాను ఏ తప్పు చేయలేదని, గన్‌ మెన్లు లేకుండా నేను తిరిగేందుకు నేను సిద్ధం మీరు సిద్ధామా అని సవాల్‌ చేశారు. నా సహనానికి ఓ హద్దు ఉంది, నా సహనాన్ని పరీక్షించొదని పరీక్షిస్తే ఖబడ్దారు అని హెచ్చరించారు.

జేసీ దివాకర్‌ రెడ్డి ఆగడాలకు తాను వ్యతిరేకంగా  పోరాటం చేస్తానని అన్నారు. జేసీ తాటాకు చప్పళ్లకు బెదిరేది లేదని, దివాకర్‌ రెడ్డి వైఖరి దొంగే దొంగ అన‍్నట్లుగా వ్యహరిస్తున్నారని వాఖ్యానించారు. అనంతపురం జిల్లాలో జేసీ దౌర్జన్యాలను సహించేది లేదు. ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి మానసిక స్థితిపై అనుమానాలు ఉన్నాయి. మేమంతా కలసి జేసీని గెలిపిస్తే తాను మమ్మల్నే బెదిరిస్తున్నారు.  ఎంపీ జేసీ వల్ల టీడీపీకి చాలా సష్టం జరుగుతుందని  ప్రభాకర్  చౌదరి అన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top