కాంగ్రెస్‌లో బయటి అధ్యక్షులు చాలామంది ఉన్నారు | Know why P chidambaram attacks on PM Narendra modi | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లో బయటి అధ్యక్షులు చాలామంది ఉన్నారు

Nov 18 2018 4:26 AM | Updated on Mar 29 2019 6:00 PM

Know why P chidambaram attacks on PM Narendra modi - Sakshi

పి.చిదంబరం

న్యూఢిల్లీ: నెహ్రూ–గాంధీ కుటుంబానికి సంబంధంలేని చాలామంది నేతలు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులుగా పనిచేశారని కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం తెలిపారు. ఇలాంటి విషయాలను వదిలేసి రాఫెల్‌ ఒప్పందం, నిరుద్యోగం, మూకహత్యలు, యాంటీ రోమియా గూండాలు, ఉగ్రదాడులు, బీజేపీ హయాంలో రైతుల ఆత్మహత్యలపై స్పందించాలని ప్రధాని మోదీకి చురకలు అంటించారు. దమ్ముంటే కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవిని ఐదేళ్లు గాంధీయేతర వ్యక్తికి కేటాయించాలన్న మోదీ సవాల్‌పై ఆయన ఈ మేరకు స్పందించారు. బీఆర్‌ అంబేడ్కర్, లాల్‌బహదూర్‌ శాస్త్రి, కామరాజ్‌ నాడార్, మన్మోహన్‌ సింగ్, పట్టాభి సీతారామయ్య, పీవీ నరసింహారావు వంటి హేమాహేమీ నేతలు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించారని చిదంబరం గుర్తుచేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement