
న్యూఢిల్లీ: పార్లమెంట్‌లోని అన్ని పార్టీల సభాపక్ష నేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 8వ తేదీన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి, దాన్ని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్‌డౌన్ తదితర అంశాలపై చర్చించనున్నారు. పార్లమెంట్ ఉభయ సభల్లో కలిపి ఐదుగురికిపైగా సభ్యులున్న పార్టీల సభాపక్ష నేతలతో మోదీ మాట్లాడుతారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ చెప్పారు. ఏప్రిల్ 8వ తేదీన ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు.