ప్రభుత్వ సైట్లలో ప్రధాని ఫొటోల తొలగింపు | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ సైట్లలో ప్రధాని ఫొటోల తొలగింపు

Published Wed, Mar 13 2019 2:07 AM

Pictures of PM ministers taken down from most government websites - Sakshi

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో అమల్లోకి వచ్చిన ఎన్నికల ప్రవర్తనా నియమావళి కారణంగా ప్రధాని కార్యాలయం సహా వివిధ కేంద్ర ప్రభుత్వ వెబ్‌సైట్ల నుంచి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రుల చిత్రాలను తొలగించారు. అయితే కొన్ని మంత్రిత్వ శాఖల సైట్లలో మాత్రం మంత్రుల చిత్రాలను ఇంకా తొలగించలేదు. ఏప్రిల్‌ 11 నుంచి లోక్‌సభ ఎన్నికలు ప్రారంభమవుతాయని ఈసీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈసీ ప్రకటన నుంచే ఎన్నికల కోడ్‌ సైతం అమల్లోకి వచ్చింది. ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగిసే వరకు కోడ్‌ అమల్లో ఉంటుంది. ఈ సమయంలో మంత్రులు, అధికారిక వర్గాలు పథకాలు, వాటికి నిధుల కేటాయింపులు జరపకూడదు. ఓటర్లను ప్రభావితం చేసే విధంగా అధికార పార్టీ కానీ, మంత్రులు కానీ ఎటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు చేపట్టకూడదు. అలాగే ప్రచారానికి అధికారులను ఉపయోగించుకోకూడదు.

Advertisement
Advertisement