చైనా కవ్వింపుపై పెద్దన్న మండిపాటు

US Fire On Chinese Activity Along Ladakh Boundary - Sakshi

డ్రాగన్‌ తీరుపై అమెరికా ఆగ్రహం

వాషింగ్టన్‌ : లడఖ్‌, దక్షిణ చైనా సముద్రం సహా సరిహద్దు వివాదాల్లో చైనా దూకుడును అమెరికా ఆక్షేపించింది. చైనా నుంచి ముప్పునకు ఇవి సంకేతాలని అమెరికా సంచలన వ్యాఖ్యలు చేసింది. సరిహద్దుల్లో చైనా కవ్వింపులతో భారత్‌, చైనా దళాలు పలుమార్లు తలపడిన క్రమంలో దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాలను పర్యవేక్షించే అలిస్‌ వెల్స్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా కవ్వింపు చర్యలు, దుందుడుకు వైఖరికి పాల్పడటం బీజింగ్‌ తన అధికారాలను ఎలా ఉపయోగిస్తుందో తేటతెల్లం చేస్తున్నాయని అమెరికా పేర్కొంది.

భారత్‌ సరిహద్దుల్లో చైనా ఇటీవల కవ్వింపు చర్యలకు దిగడంతో భారత సైన్యం అప్రమత్తమైన సంగతి తెలిసిందే. తూర్పు లడఖ్‌ ప్రాంతంలోని పాంగాంగ్‌ సరస్సుతో పాటు ఉత్తర సిక్కింలోనూ గత నెలలో భారత, చైనా దళాలు తలపడ్డాయి. ఈ ఘర్షణల్లో ఇరు దేశాల సైనికులకు గాయాలయ్యాయి. ఇదే సమయంలో భారత గగనతలం సమీపంలోకి చైనా యుద్ధవిమానాలు చొచ్చుకురావడం కలకలం రేపింది. దీంతో భారత వైమానిక దళం ఆ ప్రాంతంలో సుఖోయ్‌-30 యుద్ధవిమానాలను మోహరించింది. ఇక ట్రేడ్‌వార్‌తో పాటు కరోనా మహమ్మారి నేపథ్యంలో చైనాతో అమెరికాకు తీవ్ర విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే.

చదవండి : తైవాన్‌ను మానుంచి విడదీయలేరు

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top