మమతకు త్రుటిలో తప్పిన ముప్పు | Mamata Banerjee safe after fire breaks out in her hotel room | Sakshi
Sakshi News home page

మమతకు త్రుటిలో తప్పిన ముప్పు

Apr 18 2014 8:21 AM | Updated on Sep 5 2018 9:45 PM

మమతకు త్రుటిలో తప్పిన ముప్పు - Sakshi

మమతకు త్రుటిలో తప్పిన ముప్పు

పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీకి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది.

మాల్దా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెన ర్జీకి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. ప్రచారం కోసం మాల్దా జిల్లాకు వచ్చిన మమత గురువారం మాల్దాలోని ఓ హోటల్ గదిలో బస చేయగా.. ఆ గదిలో అగ్ని ప్రమాదం సంభవించింది. సాయంత్రం 6:40 గంటలకు ఏసీ నుంచి మంటలు పుట్టి, గదిలోకి వ్యాపించాయని పోలీసులు తెలిపారు.

ప్రమాద సమయంలో బాత్‌రూంలో ఉన్న మమత.. పొగ వాసనను గ్రహించి గట్టిగా కేకలేస్తూ తన అనుచరుడు జయ్‌దీప్‌ను పిలిచారు.   వెంటనే లోపలికి వెళ్లిన జయ్‌దీప్ ఓ దుప్పటిని మమతకు చుట్టి ఆమెను సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. మంటల వల్ల గదంతా దట్టంగా పొగ అలుముకుంది. మమత ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement