రిమ్స్ లో జూడాల ఆందోళన | junior doctors protest in adilabad district | Sakshi
Sakshi News home page

రిమ్స్ లో జూడాల ఆందోళన

Apr 29 2016 12:03 PM | Updated on Aug 17 2018 2:53 PM

రిమ్స్ లో జూడాల ఆందోళన - Sakshi

రిమ్స్ లో జూడాల ఆందోళన

రోగి బంధువులు తమపై దాడి చేశారంటూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ జూనియర్ వైద్యులు ఆందోళనకు దిగారు.

ఆదిలాబాద్: రోగి బంధువులు తమపై దాడి చేశారంటూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ జూనియర్ వైద్యులు ఆందోళనకు దిగారు. గురువారం రాత్రి పురుగు మందు తాగిన ఓ వ్యక్తిని ఆస్పత్రిలో చేర్పించారు. అయితే, పరిస్థితి విషమించి ఆ వ్యక్తి శుక్రవారం ఉదయం చికిత్స పొందుతూ చనిపోయాడు. అయితే అతని మృతికి వైద్యులే కారణమంటూ రోగి బంధువులు దాడికి దిగారు. దీనిని నిరసిస్తూ జూడాలు విధులు బహిష్కరించి ధర్నా చేశారు. దాడికి కారకులను శిక్షించాలని డిమాండ్ చేశారు. అయితే, ఆస్పత్రి సూపరింటెండెంట్ వారితో మాట్లాడి, ఆందోళనను విరమింపజేసేందుకు యత్నిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement