చంద్రబాబునాయుడికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లో పడ్డాయని వైఎస్ఆర్ సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తన మీడియా ద్వారా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అసత్య ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు
చిత్తూరు: చంద్రబాబునాయుడికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లో పడ్డాయని వైఎస్ఆర్ సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తన మీడియా ద్వారా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అసత్య ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ దీక్షకు మద్దతుగా భూమన ఆధ్వర్యంలో ఆదివారం చిత్తూరు ఆర్డీవో కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసిన వాటికి భయపడే వ్యక్తి వైఎస్ జగన్ కాదని అన్నారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలకోసం పోరాడుతున్న ఏకైక నేత ఒక్క వైఎస్ జగనే అని చెప్పారు.