
సాక్షి, హైదరాబాద్ : నగరంలో వరుస హత్యలు జనాలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. శుక్రవారం లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు, గొల్కొండలో ఒకరు, పాతబస్తీలో మరోకరు దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. తాజాగా నేడు రాజేంద్రనగర్‌లోని హిమాయత్‌సాగర్ చెరువు వద్ద ఓ వ్యక్తిని దుండగులు బండరాయితో మోది హత్య చేశారు. మృతుడిని హైదర్ షా కోట్ మాధవి నగర్‌కు చెందిన సత్యనారాయణగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.