
ప్రతీకాత్మక చిత్రం
హైదరాబాద్: నగరంలో ఓ నకిలీ పోలీస్ ఆఫీసర్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్మీ, ఎన్‌ఐఏ, ఐపీఎస్ వేషాలతో సాధారణ ప్రజలను బురిడీ కొట్టిస్తూ మోసానికి పాల్పడినట్లు గుర్తించారు. నిందితుడి స్వస్థలం వైఎస్సార్ జిల్లా. సివిల్ సర్వీసెస్ సాధించలేక నకిలీ ఐపీఎస్ అవతారం ఎత్తినట్లుగా విచారణలో వెల్లడైంది. నిందితుడి మీద గతంలోనూ ఇలాంటి కేసులే నమోదైనట్లు గుర్తించారు.
నిందితుడి నుంచి డమ్మీ పిస్టల్, ఫేక్ ఐడీకార్డులు,ఫేక్ రబ్బర్ స్టాంప్‌లు, ఎన్‌ఐఏ డైరీ, ఐప్యాడ్, లాప్‌ట్యాప్, బైనాకులర్స్, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఐపీఎస్ అధికారినని చెప్పుకుని రైల్వే రిజర్వేషన్లు, కొన్ని పైరవీలు చేసే ప్రయత్నం చేసినట్లు విచారణలో తేలింది.