breaking news
duplicate police
-
నకిలీ పోలీస్ ఆఫీసర్ అరెస్ట్
హైదరాబాద్: నగరంలో ఓ నకిలీ పోలీస్ ఆఫీసర్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్మీ, ఎన్ఐఏ, ఐపీఎస్ వేషాలతో సాధారణ ప్రజలను బురిడీ కొట్టిస్తూ మోసానికి పాల్పడినట్లు గుర్తించారు. నిందితుడి స్వస్థలం వైఎస్సార్ జిల్లా. సివిల్ సర్వీసెస్ సాధించలేక నకిలీ ఐపీఎస్ అవతారం ఎత్తినట్లుగా విచారణలో వెల్లడైంది. నిందితుడి మీద గతంలోనూ ఇలాంటి కేసులే నమోదైనట్లు గుర్తించారు. నిందితుడి నుంచి డమ్మీ పిస్టల్, ఫేక్ ఐడీకార్డులు,ఫేక్ రబ్బర్ స్టాంప్‌లు, ఎన్ఐఏ డైరీ, ఐప్యాడ్, లాప్‌ట్యాప్, బైనాకులర్స్, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఐపీఎస్ అధికారినని చెప్పుకుని రైల్వే రిజర్వేషన్లు, కొన్ని పైరవీలు చేసే ప్రయత్నం చేసినట్లు విచారణలో తేలింది. -
ఇద్దరు నకిలీ పోలీసుల అరెస్ట్
రాజేంద్రనగర్: వాహనాలు పార్కింగ్ చేస్తున్న వారి వద్ద పోలీసులమని బెదిరిస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో బహదూర్‌పురాకు చెందిన మహ్మద్ ఖాలేద్, మహ్మద్ అలీ అనే ఇద్దరు వ్యక్తులు వాహనాలు పార్కింగ్ చేస్తున్న వారి వద్దకు వెళ్లి తాము పోలీసులమని బెదిరించడంతోపాటు వారి నుంచి ఇష్టమొచ్చినంత వసూళ్లకు పాల్పడ్డారు. ఇది గమనించిన స్థానిక పోలీసులు వారిద్దరిని అరెస్టు చేశారు. అదే సమయంలో వారి వద్ద నుంచి రూ.8వేల నగదు, రెండు సెల్ ఫోన్లు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన వారిని రిమాండ్ కు తరలించారు. -
నకిలీ పోలీసుల అరెస్ట్
ఏలూరు, అర్బన్ : లారీ డ్రైవర్‌ను బెదిరించి డబ్బులు వసూలుచేసిన నకిలీ పోలీసులు ఇద్దరిని త్రీ టౌన్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. సోమవారం రాత్రి జాతీయ రహదారిపై తమిళనాడుకు చెందిన లారీని అపి పోలీసులమంటూ డబ్బులు గుంజుకున్న సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్థానిక ఫైర్‌స్టేçÙన్ సెంటర్లోని ఓ కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందుతున్న యువకులపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. దర్యాప్తులో భాగంగా మంగళవారం ఉండి మండలం కల్లుగొట్ల గ్రామానికి చెందిన సోడదాసి రాకేష్, కృష్ణా జిల్లా ముసునూరు మండలం గుడిపాడు గ్రామానికి చెందిన లాగు బాబూరావు అనే ఇద్దరు యువకులను విచారించారు. నిందితులు నేరం అంగీకరించడంతో వారిని అరెస్ట్ చేశారు. వీరిని కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు. కానిస్టేబుల్ కోచింగ్‌కు వచ్చి.. లాగు బాబూరావు, సోడదాసి రాకేష్‌లు డిగ్రీ పూర్తి చేశారు. ఇటీవల పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో నగరంలోని ఓ పోటీపరీక్షల శిక్షణ కేంద్రంలో కోచింగ్‌లో చేరారు. వీరిద్దరూ విలాసాలకు అలవాటు పడటంతో ఇంటి వద్ద నుంచి తెచ్చుకున్న డబ్బులు చాలడం లే దు. దీంతో పోలీసు అవతారం ఎత్తారు. సోమవారం రాత్రి ఇద్దరూ బైకుపై జాతీయ రహదారిపై కాపుకాశారు. ఎదురుగా వస్తున్న లారీని ఆపి పోలీసులమంటూ బురిడీ కొట్టించి డ్రైవర్‌ను బెదిరించి డబ్బులు వసూలు చేశారు. -

నకిలీ పోలీస్ అరెస్ట్
రంగారెడ్డి జిల్లా: హైదరాబాద్ శివార్లలో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఓ నకిలీ పోలీస్‌ను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. హయత్‌నగర్ మండలం సంఘీనగర్ వద్ద నరసింహ అనే వ్యక్తి పోలీస్‌నని చెప్పి వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడు. దీంతో వాహనదారులు అతనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు డబ్బులు తీసుకుంటుండగా అతనిని పట్టుకున్నారు. నరసింహపై పోలీసులు కేసు నమోదు చేసి స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు.