వాహనాలు పార్కింగ్ చేస్తున్న వారి వద్ద పోలీసులమని బెదిరిస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
రాజేంద్రనగర్: వాహనాలు పార్కింగ్ చేస్తున్న వారి వద్ద పోలీసులమని బెదిరిస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసుల కథనం ప్రకారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో బహదూర్‌పురాకు చెందిన మహ్మద్ ఖాలేద్, మహ్మద్ అలీ అనే ఇద్దరు వ్యక్తులు వాహనాలు పార్కింగ్ చేస్తున్న వారి వద్దకు వెళ్లి తాము పోలీసులమని బెదిరించడంతోపాటు వారి నుంచి ఇష్టమొచ్చినంత వసూళ్లకు పాల్పడ్డారు. ఇది గమనించిన స్థానిక పోలీసులు వారిద్దరిని అరెస్టు చేశారు. అదే సమయంలో వారి వద్ద నుంచి రూ.8వేల నగదు, రెండు సెల్ ఫోన్లు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన వారిని రిమాండ్ కు తరలించారు.