హైదరాబాద్ శివార్లలో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఓ నకిలీ పోలీస్ను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు.
రంగారెడ్డి జిల్లా: హైదరాబాద్ శివార్లలో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఓ నకిలీ పోలీస్ను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. హయత్‌నగర్ మండలం సంఘీనగర్ వద్ద నరసింహ అనే వ్యక్తి పోలీస్‌నని చెప్పి వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడు. దీంతో వాహనదారులు అతనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు డబ్బులు తీసుకుంటుండగా అతనిని పట్టుకున్నారు. నరసింహపై పోలీసులు కేసు నమోదు చేసి స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు.