ఏలూరు, అర్బన్ : లారీ డ్రైవర్‌ను బెదిరించి డబ్బులు వసూలుచేసిన నకిలీ పోలీసులు ఇద్దరిని త్రీ టౌన్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. సోమవారం రాత్రి జాతీయ రహదారిపై తమిళనాడుకు చెందిన లారీని అపి పోలీసులమంటూ డబ్బులు గుంజుకున్న సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నకిలీ పోలీసుల అరెస్ట్
Oct 19 2016 1:30 AM | Updated on Apr 6 2019 8:51 PM
ఏలూరు, అర్బన్ : లారీ డ్రైవర్‌ను బెదిరించి డబ్బులు వసూలుచేసిన నకిలీ పోలీసులు ఇద్దరిని త్రీ టౌన్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. సోమవారం రాత్రి జాతీయ రహదారిపై తమిళనాడుకు చెందిన లారీని అపి పోలీసులమంటూ డబ్బులు గుంజుకున్న సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్థానిక ఫైర్‌స్టేçÙన్ సెంటర్‌లోని ఓ కోచింగ్ సెంటర్‌లో శిక్షణ పొందుతున్న యువకులపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. దర్యాప్తులో భాగంగా మంగళవారం ఉండి మండలం కల్లుగొట్ల గ్రామానికి చెందిన సోడదాసి రాకేష్, కృష్ణా జిల్లా ముసునూరు మండలం గుడిపాడు గ్రామానికి చెందిన లాగు బాబూరావు అనే ఇద్దరు యువకులను విచారించారు. నిందితులు నేరం అంగీకరించడంతో వారిని అరెస్ట్ చేశారు. వీరిని కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు.
కానిస్టేబుల్ కోచింగ్‌కు వచ్చి..
లాగు బాబూరావు, సోడదాసి రాకేష్‌లు డిగ్రీ పూర్తి చేశారు. ఇటీవల పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో నగరంలోని ఓ పోటీపరీక్షల శిక్షణ కేంద్రంలో కోచింగ్‌లో చేరారు. వీరిద్దరూ విలాసాలకు అలవాటు పడటంతో ఇంటి వద్ద నుంచి తెచ్చుకున్న డబ్బులు చాలడం లే దు. దీంతో పోలీసు అవతారం ఎత్తారు. సోమవారం రాత్రి ఇద్దరూ బైకుపై జాతీయ రహదారిపై కాపుకాశారు. ఎదురుగా వస్తున్న లారీని ఆపి పోలీసులమంటూ బురిడీ కొట్టించి డ్రైవర్‌ను బెదిరించి డబ్బులు వసూలు చేశారు.
Advertisement
Advertisement