కరోనా కట్టడికి ఇదే మార్గం! భౌతిక దూరం అంటే ఇదీ! | Sakshi
Sakshi News home page

కరోనా కట్టడికి ఇదే మార్గం! భౌతిక దూరం అంటే ఇదీ!

Published Thu, Apr 16 2020 3:15 PM

What an amazing way to teach social distancing  - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: కరోనా వైరస్ లేదా కోవిడ్ -19  విశ్వమంతా ప్రకంపనలు పుట్టిస్తూనే వుంది. ఈ వైరస్ కట్టడికి ప్రస్తుతానికి మందు, వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోవడంతో ప్రపంచమంతా లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా  అమలవుతున్నాయి. ముఖ్యంగా ఈ వైరస్ విస్తరణ  సైకిల్ ను అడ్డుకోవాలంటే  భౌతిక దూరం ఒక్కటేనని అంతా అంగీకరిస్తున్నమాట.  అయితే  కొందరు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ , తమను తాము, అంతిమంగా చుట్టూ వున్న వారిని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు.

ఈ సందర్భంగా  సోషల్ డిస్టెన్సింగ్ ఎలా పాటించాలనే దానిపై  చిన్నపిల్లలు రూపొందించిన వీడియో ఆసక్తికరంగా మారంది. భౌతిక దూరాన్ని పాటించికపోతే  ప్రమాదం ఎలా వుంటుందనే అంశాన్ని చాలా నేర్పుగా వివరించిన తీరు ఆకట్టుకుంటోంది.  సోషల్ మీడియాలో  ప్రస్తుతం వైరల్ గా మారింది. ఒకవైపు కరోనా విస్తరణతో ప్రపంచదేశాలన్నీ అష్ట కష్టాలు పడుతున్నాయి.  కరోనా  వైరస్  వ్యాప్తిని అడ్డుకునేందుకు వ్యాక్సిన్ తయారీలో శాస్త్రవేత్తలు తలమునకలై వున్నారు. మరోవైపు వ్యాధిని నిరోధించడంలో తెలివిగా తమకున్న వనరులను ఉపయోగించుకొని భౌతిక దూరాన్ని ఎలా పాటించాలనే విషయాన్ని పిల్లలు చక్కగా వివరించడం విశేషం.  అందుకే ఇది బయోకాన్ ఎండీ కిరణ్ మజుందార్ షాను ఆకట్టుకుంది. పిల్లలు చాలా తెలివైనవారు అంటూ  ఈ వీడియోను  ట్విటర్ లో షేర్ చేశారు. 

Advertisement
Advertisement