నిజామాబాద్‌లో వాల్‌మార్ట్‌ ప్రారంభం

Walmart Store in Nizamabad Soon - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రముఖ రిటైల్‌ బ్రాండ్‌ వాల్‌మార్ట్‌ ఇండియా తెలంగాణలో శరవేగంగా విస్తరిస్తోంది. రాష్ట్రంలో మూడవ క్యాష్‌ అండ్‌ క్యారీ స్టోర్‌ను నిజామాబాద్‌లో ప్రారంభించింది. ఇప్పటికే వాల్‌మార్ట్‌ ఇండియాకు హైదరాబాద్, కరీంనగర్‌లో స్టోర్లున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ముగింపు నాటికి వరంగల్‌లో నాల్గవ స్టోర్‌ను ప్రారంభిస్తామని ఇండియా సీఈఓ అండ్‌ ప్రెసిడెంట్‌ క్రిష్‌ అయ్యర్‌ తెలిపారు. ఇప్పటివరకు వాల్‌మార్ట్‌ ఇండియాకు దేశంలో 26 స్టోర్లున్నాయి. నిజామాబాద్‌లో 50 వేల చ.అ.ల్లో విస్తరించి ఉన్న ఈ స్టోర్‌ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 2 వేల మందికి ఉపాధి లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. రిటైలర్లు, రైతులకు, సప్లయర్స్‌ వంటి బీ2బీ విభాగంలో ఈ స్టోర్‌ సేవలందిస్తుందని చెప్పారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top