మన మిలియనీర్లు ఎందరంటే... | India home to 2,19,000 millionaires, says report | Sakshi
Sakshi News home page

మన మిలియనీర్లు ఎందరంటే...

Nov 7 2017 8:17 PM | Updated on Nov 7 2017 8:17 PM

India home to 2,19,000 millionaires, says report - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: మిలియనీర్ల సంఖ్యలో ఆసియా పసిఫిక్‌లోనే భారత్‌ నాలుగో అతిపెద్ద దేశంగా నిలిచింది. భారత్‌లో 2,19,000 మంది మిలియనీర్లున్నారని వీరి ఉమ్మడి సంపద 87,700 కోట్ల డాలర్లని ఆసియా పసిఫిక్‌ వెల్త్‌ రిపోర్ట్‌ 2017 వెల్లడించింది. క్యాప్‌జెమిని రూపొందించిన ఈ నివేదికలో భారత్‌లో మిలియనీర్ల సంఖ్య గణనీయంగా పెరిగినట్టు తేలింది. నివాసం, వినియోగ వస్తువులు, స్థిరాస్తులు మినహాయించి లక్ష డాలర్లు దాటిన  ఆస్తులు కలిగిన మిలియనీర్లను ఈ నివేదికలో పొందుపరిచారు.

2016 సంవత్సరాంతానికి 28,91,000 మిలియనీర్లతో జపాన్‌ ముందువరసలో ఉండగా, 11,29,000 మిలియనీర్లతో చైనా ద్వితీయ ర్యాంక్‌లో నిలిచింది. 2,55,000 అధిక నికర ఆస్తులు కలిగిన వారితో ఆస్ర్టేలియా మూడవ స్ధానం సాధించింది. 2015-16లో భారత్‌లో మిలియనీర్ల సంఖ్య 9.5 శాతం పెరగడం గమనార్హం.

ఇది చైనా, జపాన్‌లో మిలియనీర్ల వృద్ధి రేటు కంటే అధికం.మిలియనీర్ల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నా సంపద, ఆదాయ అసమానతలు వేగంగా పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement