పీఎన్‌బీ స్కాం: ఖరీదైన ఫాం హౌస్‌ పాయే | Sakshi
Sakshi News home page

పీఎన్‌బీ స్కాం: ఖరీదైన ఫాం హౌస్‌ పాయే

Published Sat, Feb 24 2018 2:20 PM

 ED attaches Nirav Modi immovable assets worth Rs 523 crore - Sakshi

సాక్షి, ముంబై: పీఎన్‌బీ మెగాస్కాంలో ఈడీ దాడుల పరంపర కొనసాగుతోంది. తాజాగా ఈ కేసులో ప్రధాన నిందితుడు నీరవ్‌మోదీకి చెందిన విలువైన పలు  స్థిర ఆస్తులను  శనివారం  ఈడీ అధికారులు సీజ్‌ చేశారు.  ముఖ్యంగా ఈ స్కాం వెలుగులోవచ్చిన తరువాత వార్తల్లో నిలిచిన మోదీ విలాసవంతమైన ఫాం హౌస్‌ను ఈడీ స్వాధీనం చేసుకుంది. వీటితోపాటు ముంబయిలో ఆరు నివాస, పది కార్యాలయాలు, పూణెలో రెండు ఫ్లాట్లను కూడా ఎటాచ్‌ చేసింది.

మనీ లాండరింగ్‌ చట్టంకింద మోదీ, ఆయన కంపెనీ నియంత్రణలో  ఉన్న 21 స్థిరాస్తులను ఈడీ అధికారులు  ఎటాచ్‌ చేశారు.  అలీబాగ్‌లో ఫాం హౌస్‌, సోలార్ పవర్ ప్లాంట్, అహ్మద్ నగర్‌లోని  135 ఎకరాల భూమి, ముంబై, పూణేలోని నివాస, కార్యాలయాల ఆస్తులు ఉన్నాయి.  వీటి మొత్తం విలువ  రూ. 523.72 కోట్లుగా ఈడీ తేల్చింది. కాగా  అలీబాగ్‌లోని  ఫాంహౌస్‌ను సీబీఐ ఇప్పటికే సీల్‌ చేయగా, తాజాగా దీన్ని ఈడీ ఎటాచ్‌ చేసింది. అలాగే మోదీకి చెందిన విలువైన  తొమ్మిదికార్లను, దాదాపు 10వేల ఖరీదైన విదేశీ వాచ్‌లను ఈడీ స్వాధీనం చేసుకుంది.
 

1/2

2/2

Advertisement
Advertisement