స్పానిష్‌ అమ్మాయి.. అనంతపురం అబ్బాయి..!!

Spanish Woman A Young Man From Anantapur Fell In Love Got Married - Sakshi

సాక్షి, తాడిపత్రి టౌన్‌: స్పెయిన్‌ యువతి, అనంతపురం జిల్లా తాడిపత్రి యువకుడు ప్రేమించుకొని పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. వివరాల్లోకి వెళితే.. తాడిపత్రికి చెందిన విజయకుమార్‌ వృత్తిరీత్యా వైద్యుడు. బత్తలపల్లిలోని ఆర్టీటీ ఆస్పుత్రిలో వైద్య సేవలు అందిస్తున్నారు. స్పెయిన్‌ దేశానికి చెందిన కార్లా అనే యువతి వృత్తి రీత్యా దంత వైద్య నిపుణురాలు. ఈమె కూడా ఆర్డీటీ ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. రెండేళ్ల క్రితం ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. ఆ తర్వాత ఇరువురూ పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చి వారి పెద్దలతో చర్చించారు. ఇరువైపుల నుంచి అంగీకారం లభించడంతో శనివారం తాడిపత్రి పట్టణంలోని మార్కండేయస్వామి ఆలయంలో పెద్దల సమక్షంలో వీరి వివాహం హిందూ సంప్రదాయంలో వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, బంధువులు వధూవరులను ఆశీర్వదించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top