రేణిగుంటలో కేసీఆర్‌కు ఘన స్వాగతం | KCR Receives Grand Welcome at Renigunta Airport | Sakshi
Sakshi News home page

రేణిగుంటలో కేసీఆర్‌కు ఘన స్వాగతం

May 26 2019 4:58 PM | Updated on May 26 2019 6:04 PM

KCR Receives Grand Welcome at Renigunta Airport - Sakshi

సాక్షి, తిరుపతి : శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనం కోసం తిరుమల పర్యటన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. కుటుంబ సమేతంగా ఆదివారం రేణిగుంట చేసుకున్న ఆయనకు  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్‌ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామి, చింతల రామచంద్రరెడ్డి తదితరులు  స్వాగతం పలికారు. కాగా కేసీఆర్‌ కుటుంబం సోమవారం ఉదయం స్వామివారిని దర్శించుకుంటారు. అంతకు ముందు కేసీఆర్‌ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట చేరుకున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో తిరుమల వెళ్లారు. రాత్రికి తిరుమలలోని శ్రీకృష్ణ అతిథి గృహంలో బస చేస్తారు. మరోవైపు కేసీఆర్‌ రాక సందర్భంగా తిరుమలలో పటిష్టమైన భద్రత చేపట్టారు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : 
రేణిగుంట ఎయిర్‌ పోర్ట్ వద్ద కేసీఆర్‌కు ఘన స్వాగతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement