ప్రేమించకుంటే.... చంపేస్తానంటున్నాడు... | Inter students file complaints against eve-teasing | Sakshi
Sakshi News home page

ప్రేమించకుంటే.... చంపేస్తానంటున్నాడు...

Mar 25 2014 10:13 AM | Updated on Jul 11 2019 8:06 PM

ప్రేమించాలని లేకుంటే హతమారుస్తానని హెచ్చరించిన యువకుడి వేధింపుల నుంచి విముక్తి కల్పించాలంటూ ఓ విద్యార్థిని గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ జె.సత్యనారాయణను కలిసి వేడుకుంది.

గుంటూరు : ప్రేమించాలని లేకుంటే హతమారుస్తానని హెచ్చరించిన యువకుడి వేధింపుల నుంచి విముక్తి కల్పించాలంటూ ఓ విద్యార్థిని గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ జె.సత్యనారాయణను కలిసి వేడుకుంది. వివరాల్లోకి వెళితే ముప్పాళ్ళ మండలం దమ్మాలపాడు గ్రామానికి చెందిన ఓ బాలిక నరసరావుపేటలోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతూ, అదే కళాశాల హాస్టల్లో ఉంటోంది. కొద్దిరోజుల క్రితం సెలవులకు ఇచ్చిన సందర్భంగా అదే గ్రామానికి చెందిన నల్లపనేని విజయ్ కుమార్ ప్రేమించాలని లేకుంటే హతమార్చుతానని హెచ్చరిస్తున్నాడు.

వేధింపులు ఎక్కువ కావటంతో తల్లిదండ్రుల సహకారంతో ఆమె ముప్పాళ్ళ పోలీస్ స్టేషన్ లో రెండు నెలల క్రితం చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టలేదని, వేధింపులకు పాల్పడుతున్న ఆకతాయిని అరెస్ట్ చేసి తనకు రక్షణ కల్పించాలని విద్యార్థిని వేడుకుంది. సానుకూలంగా స్పందించిన ఎస్పీ ఆ యువకుడిపై శాఖాపరమైన చర్యలు చేపడతామని, ధైర్యంగా ఉండాలని హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement