13 రోజుల తర్వాత సచివాలయానికి చంద్రబాబు

Chandrababu Naidu to Conduct Review Meeting on cyclone foni - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 13 రోజుల విరామం అనంతరం సచివాలయానికి వస్తున్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న నేపథ్యంలో సచివాలయానికి దూరంగా ఉన్న ఆయన గురువారం ఉదయం 11 గంటలకు రానున్నారు. ఫొని తుఫాన్‌ అత్యవసర పరిస్థితుల దృష్ట్యా తూర్పు గోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని సడలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న కేంద్ర ఎన్నికల అధికారికి లేఖ రాసిన విషయం విదితమే.

చదవండి...(తుపాను వస్తే సమీక్ష చేయొద్దా?)

ఫొని తుపాను సమాచారాన్ని ఎప్పటికప్పుడు తీర ప్రాంతాల ప్రజలకు చేరవేసేందుకు, మానవ వనరుల సమీకరణ, ఇతర నష్ట నివారణ చర్యలను చేపట్టడానికి రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అడ్డంకిగా మారిందని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో శాసనసభ, పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌ పూర్తయిన దృష్ట్యా నాలుగు జిల్లాల్లో కోడ్‌ను సడలించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.  అయితే ఆ లేఖపై కేంద్ర ఎన్నికల సంఘం ఇంకా స్పందించలేదు. ఈ నేపథ్యంలో ఫొని తుఫాన్‌ ప్రభావంపై చంద్రబాబు ....అధికారులను వివరాలు అడిగి తెలుసుకోనున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top