ప్రాణం పోయేంతవరకూ దీక్ష కొనసాగిస్తా: శివాజీ | Actor sivaji slams BJP over ap special statue | Sakshi
Sakshi News home page

ప్రాణం పోయేంతవరకూ దీక్ష కొనసాగిస్తా: శివాజీ

May 5 2015 9:45 AM | Updated on Mar 29 2019 9:31 PM

ప్రాణం పోయేంతవరకూ దీక్ష కొనసాగిస్తా: శివాజీ - Sakshi

ప్రాణం పోయేంతవరకూ దీక్ష కొనసాగిస్తా: శివాజీ

ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై నిరాహార దీక్ష చేస్తున్న నటుడు శివాజీ ...భారతీయ జనతా పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

గుంటూరు: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై నిరాహార దీక్ష చేస్తున్న నటుడు శివాజీ ...భారతీయ జనతా పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పనిలో పనిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని దుయ్యబట్టారు.  ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి బీజేపీ మోసం చేసిందని శివాజీ ఈ సందర్భంగా ఆరోపించారు. ఎన్నికలప్పుడు వాగ్దానాలు చేసిన ప్రధాని మోదీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదన్నారు.

ఢిల్లీ ప్రజలు కుళ్లుకునేలా ఏపీకి అద్భుతమైన రాజధానిని నిర్మిస్తానంటూ మోదీ మోసం చేశారన్నారు. ఏపీలో టీడీపీ, వైఎస్ఆర్ సీపీని చీల్చి బీజేపీని బలోపేతం చేయాలని చూస్తున్నారని శివాజీ వ్యాఖ్యానించారు. అయితే ప్రత్యేక హోదా ఇస్తే తప్ప బీజేపీ ఏపీ ప్రజలు ఆదరించన్నారు. తన ప్రాణం పోయేంతవరకూ దీక్ష కొనసాగుతుందని శివాజీ స్పష్టం చేశారు. కాగా ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ శివాజీ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష నేటికి మూడో రోజుకు చేరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement