HYD: 21 కిలోల గణేషుడి లడ్డూను ఎత్తుకెళ్లి తినేసిన స్కూల్‌ విద్యార్థులు

School students Looted Ganesh Laddu At Charminar PS Limits - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా గణేష్‌ నవరాత్రి ఉత్సవాల సందడి నెలకొంది. ఈనెల 18న వినాయక చవితితో మొదలైన నవరాత్రులు ఘనంగా కొనసాగుతున్నాయి. తొమ్మిది రోజులు భక్తిశ్రద్ధలతో పూజించిన అనంతరం గణేషుడిని 28న నిమజ్జనం చేయనున్నారు. 

తాజాగా హైదరాబాద్‌లోని చార్మినార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో విచిత్ర ఘటన వెలుగుచూసింది. ఝాన్సీ బజార్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం నుంచి కొంతమంది విద్యార్థులు లడ్డూను దొంగలించారు. గణనాథుడి చేతిలో పెట్టిన 21 కిలోల లడ్డూను ఎత్తుకెళ్లారు. శనివారం సాయంత్రం స్కూల్‌ నుంచి వెళ్తూ ఒక్కసారిగా మండపంలోకి చొరబడి పెద్ద లడ్డూను తీసుకెళ్లారు. అనంతరం ఆ లడ్డూని పంచుకొని తినేశారు. 

విషయం తెలుసుకున్న నిర్వాహకుడు శ్యామ్ అగ్రర్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు సీసీ ఫుటేజీ దృశ్యాలు పరీక్షించగా.. మైనర్ విద్యార్థులు చోరికి పాల్పడినట్లు రికార్డయ్యింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: రూ.2 లక్షలు లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్‌, ఆర్‌ఐ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top