ఆధునిక రైల్వేకు రూపకల్పన

PM Narendra Modi Speaks On Telangana Railways Progress - Sakshi

రూ.250 కోట్ల నుంచి రూ.3వేల కోట్లకు పెరిగిన తెలంగాణ రైల్వే బడ్జెట్‌: మోదీ

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో గత ఎనిమిదేళ్లలో రైల్వేల పురోగతి అద్భుతంగా సాగిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. 2014 కు ముందు తెలంగాణకు రైల్వే బడ్జెట్‌లో రూ. 250 కోట్ల లోపే కేటాయింపు ఉండేదని, ఇప్పుడు అది రూ. 3వేల కోట్లకు పెరిగిందన్నారు. రైలును చూడని మెదక్‌ లాంటి ప్రాంతాలకు ఇప్పుడు రైల్వే కనెక్టివిటీ ఏర్పడిందని, ఇది తెలంగాణలో రైల్వేపరంగా పురో గతికి గుర్తని ఆయన వ్యాఖ్యానించారు.

సంక్రాంతి నాడు ఆదివారం ఉదయం సికింద్రాబాద్‌– విశాఖప ట్నం మధ్య నడిచే దేశంలో ఎనిమిదో వందేభారత్‌ రైలును ఆయన లాంఛనంగా ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఢిల్లీ నుంచి ఆయన జెండా ఊపగా, సికింద్రాబాద్‌ స్టేషన్‌లో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, పర్యాటక మంత్రి కిషన్‌రెడ్డి  ప్రత్యక్షంగా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ తెలంగాణలో రైల్వేలో పురోగతిని ప్రత్యేకంగా ప్రస్తావించారు.

త్వరలోనే తెలంగాణలోని అన్ని బ్రాడ్‌ గేజ్‌ మార్గాల విద్యుదీకరణ
2014కు ముందు ఎనిమిదేళ్ళ కాలంలో తెలంగాణ ప్రాంతంలో కొత్తగా వేసిన రైలు మార్గం 125 కిలో మీటర్ల లోపే ఉండగా, గడిచిన ఎనిమిదేళ్లలో 325 కిలోమీటర్ల మేర కొత్తగా నిర్మించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ ఎనిమిదేళ్లలో ట్రాక్‌ విస్తరణ పను లు 250 కిలోమీటర్లకు పైగా జరిగాయని, విద్యుదీ కరణ పనులు మూడు రెట్లు పెరిగాయని వెల్లడించా రు. త్వరలోనే అన్ని బ్రాడ్‌ గేజ్‌ మార్గాల విద్యు దీకరణ పూర్తి చేస్తామని ప్రధాని హామీ ఇచ్చారు.

ఏపీలో కూడా బలోపేతానికి చర్యలు
ఆంధ్రప్రదేశ్‌లో కూడా రైలు నెట్‌ వర్క్‌ను బలోపేతం చేయటానికి కేంద్రం చర్యలు చేపట్టిందన్నారు. కొద్ది కాలంలోనే 350 కిలోమీటర్ల కొత్త రైలు మార్గాన్ని, 800 కిలోమీటర్ల మేర ట్రాక్‌ గేజ్‌ మార్పిడి పనులను పూర్తి చేయటాన్ని ప్రస్తావించారు. 2014 కు ముందు కాలంతో పోల్చుకుంటే ఆంధ్ర ప్రదేశ్‌లో ఏటా 60 కిలోమీటర్ల మేర మాత్రమే విద్యుదీకరణ జరగగా ఇప్పుడు ఆ వేగం ఏడాదికి 220 కిలోమీటర్లకు పెరిగిందన్నారు. దేశీయంగా సొంత పరిజ్ఞానంతో అద్భుతంగా రూపొందిన ఈ రైలు నవ భారత సామర్థ్యానికి, దీక్షకు ఒక చిహ్నం అని ప్రధాని అభివర్ణించారు. సైనిక దినోత్సవం సందర్భంగా భారత సైనికులకు కూడా ప్రధాని మోదీ ఘనంగా నివాళులర్పించారు.

పక్షం రోజుల్లో రెండోది... : ఈ ఏడాది కేవలం 15 రోజుల్లోనే రెండో వందే భారత్‌ రైలు పట్టాలెక్కిందని పేర్కొంటూ, వందే భారత్‌ రైళ్ళ తయారీలో వేగానికి ఇది నిదర్శనమన్నారు. సికింద్రాబాద్‌ వందే భారత్‌కు పూర్వం పట్టాలెక్కిన 7 వందే భారత్‌ రైళ్ళు 23 లక్షల కిలోమీటర్ల మేర ప్రయాణించాయని, ఇది భూమి చుట్టూ 58 ప్రదక్షిణలతో సమానమని పేర్కొన్నారు.

ఇక రోజువారీగా వందేభారత్‌..: ఈ రైలు సికింద్రాబాద్‌లో బయలుదేరి వరంగల్, ఖమ్మం మీదు గా ఏపీలోని విజయవాడ, రాజమండ్రి స్టేషన్లలో ఆగుతూ విశాఖపట్నం చేరుకుంటుందని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు.  తెలుగు రాష్ట్రాల ప్రజలకు వందేభారత్‌ రైలు సంక్రాంతి కానుకగా  గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పేర్కొన్నారు. త్వరలో రూ.700 కోట్ల వ్యయంతో ప్రధాని ఆధ్వ ర్యంలో సికింద్రాబాద్‌ స్టేషన్‌ అద్భుతంగా పునర్ని ర్మాణం జరగనుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలి పారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు మహమూ ద్‌ అలీ, శ్రీనివాస యాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, బీజేపీ నేతలు లక్ష్మణ్, విజయశాంతి పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top