శివబాలకృష్ణకు చుక్కెదురు.. బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత

ACB Court Dismissed Sivabalakrishnan Bail Petition - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ శివబాలకృష్ణకు చుక్కెదురైంది. శివబాలకృష్ణ బెయిల్‌ పిటిషన్‌ను నాంపల్లి ఏసీబీ కోర్టు కొట్టివేసింది. శివబాలకృష్ణ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై ఏసీబీ కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ మేరకు శివబాలకృష్ణ బెయిల్‌ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. అక్రమాస్తుల కేసులో శివబాలకృష్ణ  అరెస్ట్‌ అయిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు రూ.250 కోట్ల విలువైన అక్రమాస్తులను ఏబీసీ గుర్తించింది.

మరోవైపు శివబాలకృష్ణ వెనుక ఉన్న అధికారుల పాత్ర పై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. శివబాలకృష్ణ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నట్టు గుర్తించామని, ఆయన సమీప బంధువులు, స్నేహితులు, సహ ఉద్యోగుల ఇళ్లలో మొత్తంగా 17 ప్రదేశాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారని ఏసీబీ అధికారులు చెప్పారు.

ఇవీ ఆస్తులు... 
శివబాలకృష్ణ ఇంట్లో రూ. 84.60 లక్షల నగదు, 2 కేజీలు బంగారం, 5.5 కేజీల వెండి, 32 లక్షలు విలువ చేసే వాచ్‌లు, 3 విల్లాలు, 7 ఫ్లాట్స్‌తోపాటు కొడ కండ్ల, జనగామ, నాగర్‌కర్నూలు, సిద్ధిపేట, యా దాద్రి, పాలకుర్తి, జఫర్‌గఢ్‌ ప్రాంతాల్లో 214 ఎకరాల వ్యవసాయ భూమిని గుర్తించామని సుదీంద్ర చెప్పారు. భూమి ఆయన పేరుతోపాటు కొందరు బినామీల పేరుపై ఉందని, 29 ఓపెన్‌ప్లాట్లు ఉన్నాయని, రంగారెడ్డిజిల్లాలోనే 12, వైజాగ్, విజయవా డ, సంగారెడ్డి ప్రాంతాల్లో కూడా ఖాళీ స్థలాలు రిజి స్టర్‌ అయ్యాయన్నారు.

అన్నింటి విలువ రూ.250 కోట్లుగా ఉంటుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. సోదాలు ఇంకో నాలుగు చోట్ల కొనసాగుతున్నాయని, శివబాలకృష్ణ పై కేసు నమోదు చేసి, గురువారం న్యాయస్థా నం ముందు హాజరుపరుస్తామన్నారు. ‘ఇంకా కొన్ని విషయాలు ఆయన చెప్పలేదు.. మా విచారణకు సహకరించలేదు. కస్టడీకి తీసుకుంటే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది.’అని సుదీంద్ర తెలిపారు.

ఇది చదవండి: HMDA Siva Balakrishna Case: శివబాలకృష్ణ కేసులో మరో ట్విస్ట్‌.. ఐఏఎస్‌ అరవింద్‌.. 

whatsapp channel

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top