సాగునీటి రంగానికి మొండిచేయి
రాష్ట్ర బడ్జెట్‌లో సాగునీటి రంగానికి తీవ్ర నిరాశనే మిగిల్చింది. ఈ రంగానికి రూ.18,224 కోట్లు కేటాయించగా, కీలక ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి రూ.9,906 కోట్లు కేటాయించారు. పోలవరం ప్రాజెక్ట్‌కే రూ.6 వేలు కోట్లు పోతే.. మిగిలిన నిధులతో ఏ ప్రాజెక్ట్‌లను పూర్తి చేస్తారు. మెట్ట రైతుల వరప్రసాదిని సోమశిల హైలెవల్ కెనాల్‌కు ఎంత మేర నిధులు కేటాయించారనేది స్పష్టంగా ప్రకటించలేదు. బడ్జెట్‌లో కేవలం ఆరు శాతం మాత్రమే సాగునీటి రంగానికి కేటాయించి చేతులు దులుపుకోవడం దారుణం.
– లక్కు కృష్ణప్రసాద్, ఆంధ్రప్రదేశ్ రైతు
సంఘం జిల్లా నాయకుడు
●


