VHT 2022: మ్యాచ్‌ను గెలిపించలేకపోయిన జైశ్వాల్‌ వీరొచిత సెంచరీ 

Maharashtra Beat Mumbai By 21 Runs Vijay Hazare Trophy 2022 - Sakshi

విజయ్‌ హజారే ట్రోఫీలో భాగంగా గురువారం ముంబై, మహారాష్ట్ర మధ్య జరిగిన మ్యాచ్‌లో భారీస్కోర్లు నమోదయ్యాయి. ఇక మ్యాచ్‌లో మహారాష్ట్ర 21 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ముంబై ఓపెనర్‌ యశస్వి జైశ్వాల్‌ (135 బంతుల్లో 142, 14 ఫోర్లు, 4 సిక్సర్లు) వీరోచిత ఇన్నింగ్స్‌ ఆడినప్పటికి లాభం లేకుండా పోయింది. జైశ్వాల్‌ మినహా మిగతావారు విఫలం కావడంతో 49 ఓవర్లలో 321 పరుగులకు ఆలౌటైంది.

ఆర్మాన్‌ జాఫర్‌ 36, అజింక్యా రహానే 31 పరుగులు చేశారు. మహారాష్ట్ర బౌలర్లలో సత్యజిత్‌ బచావ్‌ ఆరు వికెట్లతో చెలరేగగా.. షామ్‌షుజ్మా రెండు వికెట్లు తీశాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన మహారాష్ట్ర నిర్ణీత 50 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 342 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్‌ రాహుల్‌ త్రిపాఠి(137 బంతుల్లో 156 నాటౌట్‌) అజేయ శతకంతో మెరవగా.. పవన్‌ షా 84 పరుగులు చేశాడు. చివర్లో అజిమ్‌ కాజీ 32 బంతుల్లో 50 పరుగులు నాటౌట్‌ రాణించాడు. 

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top