Key Battles That Could Determine Ashes 2023 Winner - Sakshi
Sakshi News home page

Ashes 2023: యాషెస్ సిరీస్‌కు సర్వం సిద్దం.. ఇరు జట్ల బలాబలాలు ఇలా..!

Jun 15 2023 4:59 PM | Updated on Jun 15 2023 5:17 PM

Key battles that could determine Ashes 2023 winner - Sakshi

క్రికెట్‌ అభిమానులను అలరించేందుకు మరో కీలక పోరు సిద్దమైంది. క్రికెట్‌ పుట్టినిల్లు ఇంగ్లండ్‌ వేదికగా ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌-2023 జూన్‌ 16నుంచి ప్రారంభం కానుంది. ఈ చారిత్రత్మాక సిరీస్‌లో ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా జట్లు తాడోపేడో తెల్చుకోనున్నాయి.

దాదాపు 141 సంవత్సరాల చరిత్ర కలిగిన యాషెస్‌ ట్రోఫీని సొంతం చేసుకునేందుకు ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌ విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా.. అదే జోరును యాషెస్‌లో కూడా కొనసాగించి ట్రోఫీని మరోసారి ముద్దాడాలని భావిస్తోంది. 

'బాజ్‌బాల్ క్రికెట్‌'
మరోవైపు టెస్టు క్రికెట్‌ను కూడా టీ20లా ఆడుతున్న ఇంగ్లండ్‌..  అదే దూకుడును ఆస్ట్రేలియాపై కూడా ప్రదర్శించాలని యోచిస్తోంది. ఇరు జట్లు మధ్య జరిగిన గత 13 మ్యాచ్‌ల్లో 11 సార్లు ఆసీస్‌పై ఇంగ్లండ్‌ పైచేయి సాధించింది. ఈసారి కూడా తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని స్టోక్స్‌ సేన భావిస్తోంది. 

ఇక సంప్రాదయ టెస్టు క్రికెట్‌లో దూకుడుగా ఆడేందుకు కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌, హెడ్‌ కోచ్‌ బ్రాండెన్‌ మెకల్లమ్‌ నేతృత్వంలోని ఇంగ్లీష్‌ జట్టు 'బాజ్‌బాల్' విధానాన్ని అవలంబిస్తోంది. ఇటీవలే ఐర్లాండ్‌తో జరిగిన ఏకైక టెస్టులో కూడా ఇంగ్లండ్‌ ఈ తరహా దూకుడునే ప్రదర్శించి.. 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక యాషెస్‌ సిరీస్‌ నేపథ్యంలో ఇరు జట్ల బలాబాలాలుపై ఓ లూక్కేద్దం.

ఇంగ్లండ్‌ విషయానికి వస్తే.. బెన్‌స్టోక్స్‌ సారధ్యంలోని ఇంగ్లీష్‌ జట్టు బ్యాటింగ్‌, బౌలింగ్‌ పరంగా పటిష్టంగా కన్పిస్తోంది. అయితే ఓపెనర్‌ జాక్ క్రాలే ఫామ్‌ మాత్రం ఇంగ్లండ్‌ జట్టు మెన్‌జ్‌మెంట్‌ను కాస్త కలవరపెడుతోంది. క్రాలీకి అవకాశాలు ఎక్కువగా లభిస్తున్నప్పటికీ తన స్థాయికి తగ్గట్టు ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఇది ఒక్కటి మినహా ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ లైనప్‌లో మరి ఎటువంటి సమస్యలేదు. బెన్‌ డాకెట్‌, ఓలీ పోప్‌,జోరూట్‌, హ్యరీ బ్రూక్‌ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు.

కాబట్టి యాషెస్‌ సిరీస్‌లో పరుగులు వరద పారడం ఖాయం. ఇక బౌలింగ్‌ విభాగంలో స్టువర్ట్‌ బ్రాడ్‌, జేమ్స్‌ అండర్సన్‌, క్రిస్‌ వోక్స్‌ వంటి సీనియర్‌ బౌలర్లు ఉన్నారు. వీరు బంతితో రాణిస్తే ఆసీస్‌ బ్యాటర్లకు కచ్చితంగా చుక్కలు కన్పిస్తాయి.

ఆస్ట్రేలియా విషయానికి వస్తే.. ఇటీవల టీమిండియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో కమ్మిన్స్‌ సేన బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. అయితే ఒక్క సమస్య మాత్రం ఆసీస్‌ జట్టును వెంటాడుతోంది. ఆ జట్టు స్టార్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ పేలవ ఫామ్‌ మాత్రం జట్టు మెనెజ్‌మెంట్‌ను తీవ్ర ఆందోళను కలిగిస్తోంది.

అదే విధంగా మరోఓపెనర్‌ ఉస్మాన్‌ ఖావాజా కూడా డబ్ల్యూటీసీ ఫైనల్లో విఫలమయ్యాడు. యాషెస్‌ సిరీస్‌లో ఉస్మాన్‌ ఫామ్‌లోకి రావడం ఆస్ట్రేలియాకు ఎంతో అవసరం. మరోవైపు స్టీవ్‌ స్మిత్‌, ట్రావెస్‌ హెడ్‌ అద్బుతమైన ఫామ్‌లో ఉండడం కంగరూ జట్టుకు కలిసిచ్చే ఆంశం. ఇక బౌలింగ్‌లో అయితే కెప్టెన్‌ ప్యాట్‌ కమ్మిన్స్‌, మిచిల్‌ స్టార్క్‌, స్కాట్‌ బోలాండ్‌, నాథన్‌ లయాన్‌ వంటి అనుభవజ్ఞులైన బౌలర్లు ఉన్నారు. 

ఆసీస్‌దే పైచేయి
ఇప్పటి వరకూ యాషెస్‌ చరిత్రలో మొత్తం 330 యాషెస్‌ టెస్ట్‌ మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ఆస్ట్రేలియా 134 టెస్టులు, ఇంగ్లండ్‌ 106 టెస్టులు గెలవగా.. 90 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.

తొలి టెస్టుకు తుది జట్లు(అంచనా)
ఇంగ్లండ్‌: హ్యారీ బ్రూక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, జో రూట్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), మొయిన్‌ అలీ, ఓలీ పోప్ (వికెట్ కీపర్), జేమ్స్ అండర్సన్, స్టువర్ట్‌ బ్రాడ్, ఓలీ రాబిన్‌సన్, మార్క్‌ వుడ్

ఆసీస్: ఉస్మాన్‌ ఖవాజా, డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, స్టీవ్‌ స్మిత్, మార్నస్‌ లబుషేన్, కామెరూన్‌ గ్రీన్, అలెక్స్ కేరీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్‌ స్టార్క్‌, బోలాండ్‌,  నాథన్ లైయన్

చదవండి: MajorLeagueCricket: ముంబై ఇండియన్స్‌ ఫ్రాంచైజీ కీలక నిర్ణయం.. కెప్టెన్‌గా పొలార్డ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement